రెండు రీచ్‌లకు టెండర్ల ఖరారు
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని రెండు ఇసుక రీచ్‌లకు సంబంధించిన టెండర్లను కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జేసీ కార్తీక్ ఆధ్వర్యంలో గురువారం ఖరారు చేశారు. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం రీచ్‌కు ఆరు టెండర్లు దాఖలుకాగా, వివిధ కారణాలతో రెండింటిని తిరస్కరించారు. మిలీనియం స్టీల్స్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. పల్లిపాడుకు సంబంధించి ఎనిమిది టెండర్లు రాగా, వివిధ కారణాలతో మూడింటిని తిరస్కరించారు. ఈ రీచ్‌ను భరణికుమార్ దక్కించుకున్నారు. పూర్తి స్థాయిలో అనుమతులొచ్చాక జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని జేసీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment