వేధింపులకు పరాకాష్ట | - | Sakshi
Sakshi News home page

వేధింపులకు పరాకాష్ట

Published Fri, Nov 15 2024 12:26 AM | Last Updated on Fri, Nov 15 2024 12:26 AM

వేధిం

వేధింపులకు పరాకాష్ట

వేధిస్తే సహించేదిలేదు

‘సామాజిక’

గొంతుకలకు సంకెళ్లు

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

వైఎస్సార్సీపీ నేతలు, సోషల్‌

మీడియానే లక్ష్యంగా వేధింపులు

జిల్లాలో 21 మందిపై కేసులు నమోదు

భారత రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే లక్ష్యంగా రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు.. సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో అసమర్థత.. అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను ఎవరైనా వ్యక్తపరిస్తే.. మాకే ఎదురొస్తావానంటూ ఉరుకుతోంది. ఇలా ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేస్తూ ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. హామీలను అమలు చేయాలంటూ సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యాక్టివిస్టులు పోస్టులు పెట్టడమే తప్పనే రీతిలో చెలరేగిపోతూ అక్రమ కేసులు బనాయిస్తోంది.

నెల్లూరు (క్రైమ్‌): అభివృద్ధి.. సంక్షేమాన్ని కాంక్షించే తమను ప్రజలు గెలిపించారనే అంశాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా, సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయడకుండా కాలయాపన చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో తమపై వస్తున్న వ్యతిరేకతను ఎలాగైనా దారి తప్పించాలనే ఉద్దేశంతో వికృత క్రీడకు తెరలేపింది. తమ వైఫల్యాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా శిక్షార్హులేననే విషయాన్ని విస్మరిస్తోంది. ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను ప్రశ్నించడమే తప్పనే రీతిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మూడు కేసులను నమోదు చేశారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్యలకు ఇది పరాకాష్టగా నిలుస్తోంది.

అవన్నీ.. మాకు కనిపించవు..!

సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకే కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, మాజీ మంత్రులపై విషం చిమ్మడమే లక్ష్యంగా కూటమి పార్టీల నేతలు, ఆ పార్టీల సోషల్‌ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఇవేవీ పోలీసులకు కనిపించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఖాకీలు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశం దీని ద్వారా తేటతెల్లమవుతోంది.

జిల్లాలో 21 కేసులు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ తదితరులపై వ్యతిరేక పోస్టులు పెట్టారంటూ 21 మందిపై జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి పాలకుల లోపాలను రాజకీయ పార్టీలతో పాటు సామాజిక స్పృహ కలిగిన అనేక మంది తమకు తోచిన రీతిలో ఎత్తి చూపడం సహజం. ఇలాంటి విమర్శ జనహితమే అయినప్పుడు అందులోని మంచిని తీసుకొని లోపాలను పాలకులు సవరించుకునేవారు. అయితే నేడు ఆ పరిస్థితే కనుమరుగైంది. తమనే తప్పుపడతారాననే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కర్కశంగా వ్యవహరిస్తోంది. వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై టీడీపీ, జనసేన నేతలతో ఫిర్యాదులు చేయించి.. పోలీసుల ద్వారా ఎక్కడెక్కడి వారినో ఇక్కడికి తీసుకొచ్చి కేసుల పేరిట వేధిస్తోంది. వీటి వివరాలను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. పాత కేసులనూ తిరగదోడుతున్నారు.

ప్రశ్నించడమేనా కాకాణి నేరం..?

మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సైతం పోలీసుల వేధింపులు తప్పలేదు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సెప్టెంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. దీనిపై ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారంటూ వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్‌మీట్‌ పెడితే.. ఆ వీడియోను ఫార్వార్డ్‌ చేశారని మరో కేసు పెట్టారు. స్థానిక ఎమ్మెల్యేపై అసభ్యకరంగా పోస్టు పెట్టారంటూ ముత్తుకూరు పోలీస్‌స్టేషన్లో మరో కేసు నమోదైంది.

ఇతర జిల్లాల వారిపై దాష్టీకం

● సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారంటూ నెల్లూరులోని 35వ డివిజన్‌ జనసేన నేత అశోక్‌ ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ మేకా వెంకటరామిరెడ్డిపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

● రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలను మా ర్ఫింగ్‌ చేసి అసభ్యకర మెసేజ్‌లతో పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ నెల్లూరులోని 32వ డివిజన్‌ టీడీపీ నేత ముఫీద్‌ ఫిర్యాదు మేరకు సత్యసాయి జిల్లా రొద్దం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన బాలాజీరెడ్డిపై వేదాయపాళెం పోలీసులు ఈ నెల 12న కేసు నమోదు చేశారు.

● సామాజిక మాధ్యమాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్‌ చిత్రాలను మార్ఫింగ్‌ చేశారని ఆరోపిస్తూ సంగం మండలం తలుపూరుపాడుకు చెందిన టీడీపీ నేత బాబు ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన హనుమంతరెడ్డిపై పోలీసులు ఈ నెల 12న కేసు నమోదు చేశారు.

● పల్నాడు, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరిపై.. కందుకూరుకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త పఠాన్‌ ఆయూబ్‌ఖాన్‌పై కందుకూరు సర్కిల్‌ పరిధిలో కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జమ్‌పాడుకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త అన్నంగి నరసింహస్వామిపై కందుకూరు స్టేషన్లో కేసు నమోదైంది.

● అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త జనికుల రామాంజనేయులుపై కందుకూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు.

పోసానిపై కేసు

కావలి: సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కావలి డీఎస్పీకి టీడీపీ నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. మరో 15 మందితో జాబితాను తయారు చేస్తున్నామంటూ బహిరంగంగా ప్రకటించారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే కీసర రాజశేఖర్‌రెడ్డిపై తుఫాన్‌నగర్‌కు చెందిన ఏగూరు చంద్రశేఖర్‌ ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు.

కావలి: సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న యాక్టివిస్ట్‌లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తే సహించేది లేదని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పట్టణంలోని 11వ వార్డుకు చెందిన పార్టీ ఇన్‌చార్జి, సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఆత్మకూరు రాజేష్‌పై కేసులతో పోలీసులు వేధిస్తుండటంతో కాకాణి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గురువారం పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

విజయవాడలో వరదలొచ్చిన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా సీఎస్‌పురానికి చెందిన హరీశ్వర్‌రెడ్డిపై నెల్లూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి విచారణ పేరిట వేధించి నోటీసులిచ్చి పంపారు.

తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టిన ఉదయగిరి మండలం బండగానిపల్లికి చెందిన బేరి తిరుపతిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పె ట్టారంటూ కావలిలోని 11వ వార్డుకు చెందిన సో షల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు ఆత్మకూరు రాజేష్‌, దామర్ల శ్రావణ్‌కుమార్‌పై అక్కడి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

దగదర్తిలో టీడీపీ నేత తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. వీటిని తన వాట్సాప్‌ గ్రూప్‌లో ఫార్వార్డ్‌ చేశారంటూ ప్రభావతిపై కేసు నమోదు చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలపై మీడియాలో వచ్చిన కథనాలు, పోస్టులను సామాజిక మాధ్యమాల్లో ఫార్వార్డ్‌ చేశారని బోగోలుకు చెందిన వీరరఘు, కుందుర్తి శ్రీనివాసులు, మేకా శ్రీనివాసులు, ఎస్జీవీ కండ్రికకు చెందిన ఉప్పాల మాచర్ల, విశ్వనాథరావుపేటకు చెందిన సుందరరాజుపై కేసులు నమోదయ్యాయి.

సీఎం, డిప్యూటీ సీఎంపై తప్పుడు ఫిర్యాదు లు పెట్టారంటూ కావలికి చెందిన వెంకటరామిరెడ్డిపై అక్కడి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వేధింపులకు పరాకాష్ట 
1
1/2

వేధింపులకు పరాకాష్ట

వేధింపులకు పరాకాష్ట 
2
2/2

వేధింపులకు పరాకాష్ట

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement