దశల వారీగా ప్రయోగం ఇలా..
● జీఎస్ఎల్వీ – ఎఫ్15 రాకెట్‌కు మంగళవారం వేకువజామున 2.53 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 27.30 కౌంట్‌డౌన్ సమయంలో రాకెట్‌లోని లిక్విడ్ స్ట్రాపాన్ బూస్టర్లలో ధ్రవ ఇంధనం నింపే ప్రక్రియను చేపట్టారు.
● బుధవారం ఉదయం 6.23 గంటలకు కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే 0.00 నిమిషాలకు కోర్ అలోన్ దశలో 138.1 టన్నుల ఘన ఇంధనం, రాకెట్‌కు చుట్టూ ఉన్న నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 170.7 టన్నుల ద్రవ ఇంధనం మండించి మొదటిదశను 151.2 సెకండ్లకు పూర్తి చేశారు.
● రాకెట్‌లోని రెండోదశను 149.6 సెకండ్లకు మండించి 151.2 సెకండ్లకు పూర్తి చేశారు. ఈ దశలోనే రాకెట్ శిఖర భాగంలో ఉపగ్రహానికి అమర్చిన హీట్ షీల్డ్స్ 237.42 సెకండ్లకు విడిపోయాయి.
● రాకెట్‌లోని మూడో దశ అంటే క్రయోజనిక్ దశను 295.68 సెకండ్లకు మండించి 1,135.38 నిమిషాలకు కటాఫ్ చేశారు. మళ్లీ 1,140.38 సెకండ్లకు క్రయోజనిక్ ఇంజిన్‌ను మండించి 1,147.38 సెకండ్లకు (19.10 నిమిషాలు) 2,250 కిలోల బరువైన నావిక్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి సెంచరీ ప్రయోగాన్ని పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment