సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాల్సిందే
బడ్జెట్ ప్రతులు దహనం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాల్సిందేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ, ఎంఎ గఫూర్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్‌లోని సీతారాం ఏచూరి ప్రాంగణంలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర 27వ మహాసభల్లో రెండో రోజు ఆదివారం రాష్ట్ర, జిల్లా నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు పలు తీర్మానాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు 8 నెలల పాటు ఓపిక పట్టారని, ఇక ఓపిక పట్టలేరని, సహనం నశిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలు కానీ హామీలు ఇచ్చారని, అప్పుడు అప్పు లు ఉన్నాయనే విషయం తెలియదా? అని నిలదీశారు. ఆర్థిక సంక్షోభం పేరుతో ప్రజలను మోసం చేయడం, కాలయాపన చేయడం తగదన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వలేదో ప్రజలుకు వివరించాలన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలపై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుతోపాటు ఏపీ సమగ్రాభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వమే నడపాలని తదితర 28 అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మోహన్‌రావు, సీఐటీయూ ఆలిండియా అధ్యక్షురాలు హేమలత, కోశాధికారి సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, మధు, ప్రభాకర్‌రెడ్డి, బాబూరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య పాల్గొన్నారు.
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశంలోని రైతులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగకరంగా కేంద్ర బడ్జెట్ లేదని ఆరోపిస్తూ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. సీఐటీయూ ఆలిండియా అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ రైతాంగానికి వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, సంపన్నులకు మద్దతు ఇచ్చేలా బడ్జెట్ రూపొందించారన్నారు. కార్యక్రమంలో ఆల్‌ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్, ఆల్ ఇండియా సీఐటీయూ కోశాధికారి సాయిబా బు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య, ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
అప్పుల పేరుతో మోసం చేయడం తగదు
సీపీఎం రాష్ట్ర మహాసభల్లో నిలదీసిన పొలిట్‌బ్యూరో సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment