మిర్చి ఎక్కువ.. ధర తక్కువ
హిందూపురం అర్బన్: కాసులు కురిపించాల్సిన ఎండుమిర్చి రైతులకు కన్నీళ్లు మిగులుస్తోంది. మార్కెట్‌కు సరుకు ఎక్కువగా వస్తుండటం... కొనేవారు లేకపోవడంతో ధర అమాంతం పడిపోయింది. దీనికి తోడు విదేశాలకు ఎండుమిర్చి ఎక్స్‌పోర్టు లేకపోవడంతో రైతులు ఆశించినంత ధర కావడం లేదు.
వ్యాపారులు నిర్ణయించిందే ధర..
హిందూపురం మార్కెట్‌లో ఎండుమిర్చి కొనుగోళ్లు ఈ–నామ్ పద్ధతిలో సాగుతున్నా... చివరకు వ్యాపారులు నిర్ణయించిన ధరే ఖాయమవుతోంది. మార్కెట్‌లో మిర్చి కొనుగోలు చేసే వ్యాపారులు పదిమందే ఉండటంతో మార్కెట్‌కు ఎంత సరకు వచ్చినా వారే కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారంతా సిండికేట్ అయ్యారు. పోటీ లేకపోవడంతో వారు నిర్ణయించిన రేటుకే ఎండుమిర్చి విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
క్వింటాపై రూ.4,500 తక్కువ
గత ఏడాది ఇదే సమయంలో క్వింటా ఎండుమిర్చి మొదటి రకం క్వింటా రూ.22 వేల వరకూ పలికింది. ఆసారి మాత్రం క్వింటా రూ.18,500 మించి పలకలేదు. మార్కెట్‌కు ఎండుమిర్చి ఎక్కువ రావడంతో ప్రస్తుతం క్వింటా రూ.11 వేల నుంచి రూ.13 వేలలోపే పలుకుతోంది. మంగళవారం హిందూపురం మార్కెట్‌కు 234 క్వింటాళ్ల ఎండు మిర్చి రాగా.. మొదటి రకం మిర్చి క్వింటా రూ.18,500, రెండో రకం రూ.9 వేలు, మూడవ రకం క్వింటా రూ.7 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు.
రూ.13 వేలలోపే పలుకుతున్న
క్వింటా ఎండుమిర్చి
Comments
Please login to add a commentAdd a comment