No Headline
●వరి... మిగిల్చింది వర్రీ
వరి పంట చేతికొస్తే కష్టాలు గట్టెక్కుతాయన్న రైతన్నల ఆశలపై అకాల వర్షాలు నీళ్లు చల్లాయి. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలతో వరిలో దిగుబడి గణనీయంగా తగ్గింది. కోతకు వచ్చిన వరి పంట గాలుల ఉధృతికి ఎక్కడకక్కడ తలవాల్చడంతో వడ్లు రాలిపోయాయి. దీంతో రైతులు హర్వెస్టర్లను ఏర్పాటు చేసి పంట కోతలు చేపట్టారు. చేతికి వచ్చిన అరకొర ధాన్యాన్నే రహదారిపై ఆరబోశారు. అకాల వర్షాలు రాకుంటే ఆశించిన మేర పంట చేతికొచ్చి కష్టాలు గట్టెక్కవని పామురాయికి చెందిన రైతు ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment