గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: సత్యసాయి 99వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈ నెల 22న ఆయన పుట్టపర్తికి విచ్చేయనున్నారు. గవర్నర్ పర్యటించే స్థలాలను, ఆయన బస చేసే ప్రాంతాలను కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న గురువారం పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో, సాయి శ్రీనివాస గెస్ట్ హౌస్, ప్రశాంతి నిలయంలో కాన్వాయ్ నిర్వహణ, పుట్టపర్తి పట్టణంలో పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణకు చేట్టాల్సిన చర్యలపై చర్చించారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
షెడ్యూల్ ఇలా..
ఈ నెల 22న గవర్నర్ విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 11 గంటలకు బయలు దేరి బెంగళూరు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు కోడికొండ చెక్ పోస్ట్ వద్ద ఉన్న రక్షా అకాడమికి చేరుకుంటారు. అక్కడ కొంత సేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి బయలు దేరి రాత్రి 11 గంటలకు పుట్టపర్తిలోని సాయి శ్రీనివాస గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 23న ఉదయం 9 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకుంటారు. తర్వాత జయంతి వేడుకల్లో పాల్గొంటారని కలెక్టర్ చేతన్ తెలిపారు. అనంతరం ఉదయం 11.05 నిమిషాల నుంచి 11.20 వరకూ సాయి శ్రీనివాస అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి రోడ్డు మార్గంలో బయలు దేరి 12.20 నిమిషాలకు రక్షా అకాడమికి చేరుకుంటారు. అక్కడి నుంచి 12.35 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి బెంగళూరు చేరుకుంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment