ఆకట్టుకున్న సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: సత్యసాయి 99వ జయంతి వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్‌కు చెందిన యువత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ‘ ఎస్‌ఎస్‌ఎస్‌ఓ – ది రాయల్ పాత్ టూ ట్రాన్స్‌ఫర్మేషన్’ పేరుతో చక్కటి ప్రదర్శన నిర్వహించారు. మానవతా విలువలు, ఆధ్యాత్మికత, సత్యసాయి బోధనలు అన్న అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో 5,517 విద్యాసంస్థలకు చెందిన 2,72,300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వ్యాసరచన పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన 20 మంది బాలికలు, ఐదుగురు బాలురకు బంగారు పతకాలు , సర్టిఫికెట్లను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి, డాక్టర్ మోహన్, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్యా అందజేశారు. అనంతరం మాల్దోవాకు చెందిన వయోలిన్ పియానో వాయిద్య కళాకారిణులు అలెగ్జాండ్రా, లిడియా ఇచ్చిన ప్రదర్శ అందరినీ మంత్ర ముగ్దులను చేసింది.
Comments
Please login to add a commentAdd a comment