వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు అరికట్టండి
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మహిళలని కూడా చూడకుండా టీడీపీ నాయకులు దాష్టీకాలకు తెగబడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఎస్పీ రత్నను కోరారు. శుక్రవారం ఆయన బాధితులతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ రత్నను చాంబర్‌లో కలిసి వినతి పత్రం సమర్పించారు. రౌడీషీటర్, టీడీపీ హిందూపురం పార్లమెంట్ అఽధికార ప్రతినిధి సాలక్క గారి శ్రీనివాసులు కొత్తచెరువులో చెలరేగిపోతున్నాడన్నారు. భూ ఆక్రమణలతో సామాన్యులపై దౌర్జన్యం చేస్తున్నాడన్నారు. ఎవరైనా ప్రశ్నించినా, ఎదురు తిరిగినా దాడులకు తెగబడుతున్నాడన్నారు. అలాగే కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైఎస్సార్ సీపీ నేతలను అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టులు పెడుతున్నారని, వారందరిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కొత్తచెరువులో టీడీపీ నాయకుడు సాలక్కగారి శ్రీనివాసులు, మరికొంతమంది టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారన్నారు. ఇళ్లలోకి ప్రవేశించి మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. పోలీసులకు అన్నీ తెలిసినా తెలియనట్టు ఉండిపోయారన్నారు.
అసెంబ్లీలో మాత్రం గొప్పలు..
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత తమ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం చేస్తున్నామని అసెంబ్లీలో ఊదరగొడుతుండగా, క్షేత్ర స్థాయిలో మాత్రం కూటమి పార్టీల నాయకులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్‌లోని ఒక స్థలం వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని, అయినా అధికార పార్టీ అండతో రామచంద్ర, వీరయ్య ఇంటి నిర్మాణం చేపడుతున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో పుట్టపర్తి నియోజవర్గంలో హింసాత్మక ఘటనలు, దౌర్జన్యాలు జరగలేదని, ఇప్పుడు మాత్రం అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దాడులను ప్రోత్సహిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామన్నారు. దుద్ద్దుకుంట శ్రీధర్‌రెడ్డి వెంట మన్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వైస్ చైర్మన్ తిప్పన్న, ఓడీచెరువు జెడ్పీటీసీ దామోదర్‌రెడ్డి, శ్యామ్ సుందర్‌రెడ్డి, గంగాద్రి, నరసారెడ్డితో పాటు బాధితులు ఉన్నారు.
సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు అడ్డుకట్ట వేయాలి
రౌడీషీటర్ సాలక్కగారి
శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలి
ఎస్పీ రత్నను కోరిన మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment