మంత్రి సవిత క్షమాపణ చెప్పాలి
అనంతపురం కార్పొరేషన్: మహిళలను కించపరిచేలా మాట్లాడిన మంత్రి సవిత బేషరుతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల శాసన మండలిలో మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్వయం సహాయక సంఘాలకు స్వయం ఉపాధి కల్పించకుండా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం ద్వారా మహిళలు మత్తు, గంజాయికి అలవాటుపడ్డారని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లాలో రెండు లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళలు ఆర్థిక పురోగతి సాధించేందుకు ప్రతి పథకంలోనూ అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భాగస్వాములను చేయడంతో పాటు రూ.లక్షల్లో రుణాలు ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణ మాఫీ చేశారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు భారతి, శోభారాణి, కమర్తాజ్, దేశాయ్ భారతిరెడ్డి, అంజలి, ప్రసన్నలక్ష్మి, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం
జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment