నేడు జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు
పుట్టపర్తి టౌన్: ‘స్పెషల్ సమ్మరీ రివిజన్ –2025’లో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని, బీఎల్‌ఓలందరూ తప్పని సరిగా విధుల్లో ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 17, 20 వార్డులు, ప్రశాంతి గ్రాం, బీడుపల్లి గ్రామాల్లోని 108, 109, 110వ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, కమిషనర్ ప్రహ్లాద్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బీఎల్‌ఓలంతా ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతను ఫారం–6 ద్వారా ఓటరు నమోదు చేయాలన్నారు. అలాగే మృతుల, వలస వెళ్లిన వారి వివరాలను ఫారం–7 ద్వారా తెలియజేయాలన్నారు. అలాగే ఓటరు జాబితాలో తప్పులను సరిచేసుకునేందుకు ఫారం–8 ఉపయోగించాలని సూచించారు.
బీఎల్‌ఓలంతా కచ్చితంగా విధుల్లో ఉండాలని కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment