వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Published Wed, Nov 27 2024 7:26 AM | Last Updated on Wed, Nov 27 2024 7:26 AM

-

గుడిబండ: మండలంలోని దాసరపల్లికి చెందిన వివాహిత శిల్ప (32) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. భర్త చంద్రతో కలసి వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న శిల్పకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె సోమవారం రాత్రి కడుపు నొప్పి తాళలేక అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున భర్త నిద్ర లేచేసరికి శిల్ప కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వారి సాయంతో గాలింపు చేపట్టి వ్యవసాయ బావిలో తేలియాడుతున్న శిల్ప మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి సాకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

కర్ణాటకలో హత్య..

పెనుకొండలో మకాం

పెనుకొండ: కర్ణాటకలో ఓ వ్యక్తిని హత్య చేసి పోలీసులు కళ్లు గప్పి కుటుంబంతో సహ పెనుకొండకు మకాం మార్చిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. వివరాలు... కర్ణాటకలోని హవేరి పట్టణానికి చెందని బాబ్జాన్‌, ఆయన భార్య కొన్ని నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని హతమార్చారు. అనంతరం పోలీసుల కళ్లు గప్పి భార్యాపిల్లలతో కలసి పెనుకొండలోని దర్గాపేటలో అద్దె ఇంట్లోకి మకాం మార్చాడు. హత్య ఘటనపై కేసు నమోదు చేసిన హవేరి పోలీసులు బాబ్జాన్‌ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పెనుకొండకు మకాం మార్చినట్లు గుర్తించిన హవేరి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఇక్కడకు చేరుకున్నారు. నిందితుడి ఫోన్‌ నంబర్‌ కాల్‌ లిస్ట్‌ ఆధారంగా ఆరా తీస్తూ పోయారు. ఈ క్రమంలో సోమందేపల్లి మండలం చల్లాపల్లికి చెందిన ఓ డీలర్‌ తనకు ఇటీవల సదరు నంబర్‌ నుంచి కాల్‌ వచ్చిందని, స్టోర్‌ బియ్యం దింపినట్లుగా అవతలి వ్యక్తి తనకు సమాచారం అందించాడని వివరించడంతో స్థానిక పోలీసుల సాయంతో మఫ్టీలో పెనుకొండ తహసీల్దార్‌ కార్యాలయం వెనుక ఉన్న స్టాక్‌ పాయింట్‌ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే తమ కళ్లెదుటే నిందితుడు తిరుగుతున్నా పోలీసులు గుర్తు పట్టలేకపోయారు. అక్కడే ఉన్న కొందరు హమాలీలు ఇతనే బాబ్జాన్‌ అని తెలపడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాబ్జాన్‌ నివాసముంటున్న ఇంటి వద్దకెళ్లి భార్యతో పాటు ఇతర కుటుంబసభ్యులనూ అదుపులోకి తీసుకుని హవేరీకి బయలుదేరి వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement