చాలా భయమేస్తోంది
కొన్నేళ్లుగా నా భర్త చిరంజీవికి డయాలసిస్ చేయిస్తున్నాం. గతంలో 108 ద్వారా ఆస్పత్రికి తీసుకువచ్చేవాళ్లం. ఇప్పుడు వాహనం రావడం లేదు. వారంలో మూడు రోజుల సర్వజనాస్పత్రికి రావాలి. వచ్చినప్పుడల్లా రూ.300 వరకు ఖర్చవుతోంది. ఆటోలో వస్తున్న సమయంలో నా భర్త ఒక్కోసారి అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది. ఉచిత రవాణా సౌకర్యం కల్పించి పేదోళ్లను ఆదుకోవాలి. – లీలావతి,
వడ్డిపల్లి, ఆత్మకూరు మండలం
రూ.500 ఖర్చవుతోంది
మా తమ్ముడు సత్యనారాయ ణ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతనికి భార్య లేదు. ఇద్దరు పిల్లలు చదువుకునేందుకు వెళ్తుంటారు. డయాలసిస్ కావాల్సినప్పుడుల్లా నేనే తీసుకురావాల్సి వస్తోంది. రూ.500 వరకు ఖర్చు చేసు కుని తీసుకొస్తున్నా. మాలంటి పేదోళ్లు ప్రతి సారి రూ.వందలు ఖర్చు చేసుకోవడం చాలా భారమైన పని. డయాలసిస్ చేయించుకుని తీసుకెళ్లేలోపు నా తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడు.
– జయలక్ష్మి, ధర్మబిక్షం కాలనీ, అక్కంపల్లి
Comments
Please login to add a commentAdd a comment