...ఇలా జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట అఘాయిత్యాలు వెలుగు
మంగళవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
● ఈ నెల 4వ తేదీన పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామంలో పదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. పాఠశాల నుంచి ఇంటికొచ్చిన బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తం కాగా, వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
● సోమందేపల్లిలోని స్నేహలత నగర్‌కు చెందిన ఓ వ్యక్తి 9వ తరగతి చదివే విద్యార్థినిపై కన్నేసి కొన్ని రోజులుగా లైంగికంగా వేధించిన ఘటన ఈ నెల 14న వెలుగుచూసింది. మొబైల్ నంబర్‌కు అసభ్యకర మెసేజీలు చేస్తుండటంతో బాలిక ఇంట్లో చెప్పుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది.
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండాపోయింది. హిందూపురం, చిలమత్తూరు, పుట్టపర్తి, సోమందేపల్లి.. ఇలా ప్రతిచోటా మహిళలు, బాలికలపై చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. హత్యలు, అరాచకాల సంగతి పక్కనబెడితే సమాజంలో మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోయింది. రేప్‌లు, గ్యాంగ్ రేప్‌లు, కలకలం రేపుతున్నాయి. ఏ ఊర్లో ఎలాంటి ఘటన చోటు చేసుకుంటుందో అర్థం కాని పరిస్థితి. డ్రోన్ కెమెరాలతో మారుమూల ప్రాంతాల్లోనూ నిఘా అంటూ పోలీసులు చెబుతున్నా..ఊళ్లలోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దుర్మార్గాలను పీచమణచేందుకు పోలీసులు లాఠీ ఎత్తేందుకు సిద్ధమైనా... కూటమి నేతల ఒత్తిళ్లతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఒకిరిద్దరు అధికారులు కాస్త కఠినంగా వ్యవహరించగా.. వారికి బదిలీ బహుమానం అందడంతో మిగతా వారు తమకెందులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
బయటికెళ్లాలంటే భయం భయం..
మహిళలు, చిన్నారులు ఒంటరిగా బయట తిరగాలంటే భయ పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్కూలుకు వెళ్లి తిరిగి వచ్చే లోపు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. బాలికలపైనా మృగాళ్లు అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇంటికే పరిమితమైన వారికీ రక్షణ లేకుండా పోయింది. ఇళ్లలోకి దూరి గ్యాంగ్ రేప్‌లు చేస్తున్నారు. దుర్మార్గులను పోలీసులు పట్టుకున్నా.. అంతలోనే అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఫలితంగా ఎన్నో కేసులు బయటికి రాకుండా కప్పేశారు. అక్కడక్కడా ఒకటీ అర బయటికి వచ్చినా.. ప్రాధాన్యం లేని సెక్షన్లు విధించి వెంటనే బెయిల్ వచ్చే మార్గం వెతుకుతున్నారు.
గత ఆగస్టులో హిందూపురం మండలం తూమకుంట చెక్‌పోస్టు సమీపాన పెన్నానదిలో మద్యం మత్తులో ఏడేళ్ల చిన్నారిపై వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తి అత్యాచారం చేసి, చంపి అక్కడే ఇసుకలో పూడ్చేశాడు. ఈ ఘటన కలకలం రేపింది.
గత అక్టోబర్‌లో విజయదశమి పండుగ రోజున హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లిలో ఇద్దరు మహిళలపై ఆరుగురు యువకులు గ్యాంగ్‌రేప్ చేశారు. వారం రోజుల వ్యవధిలో నిందితులందరినీ పోలీసులు పట్టుకున్నారు. అందరూ నేరచరిత్ర ఉన్నోళ్లే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
చీనీ టన్ను రూ.33,190
అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం టన్ను చీనీకాయలు గరిష్టంగా రూ.33,190, కనిష్టంగా రూ.12 వేల ప్రకారం ధర పలికాయి.
జిల్లాలో బాలికలు, మహిళలకు
రక్షణ కరువు
బయటకు వెళ్లేందుకు జంకుతున్న వైనం
గ్యాంగ్‌రేప్, రేప్, దబాయింపు,
దాడులతో బెంబేలు
Comments
Please login to add a commentAdd a comment