తూకంలో మోసం
● మొక్కజొన్న వ్యాపారి గోపాల్‌పై
కేసు నమోదు
పరిగి: ఎలక్ట్రానిక్ కాటాతో తూకంలో మోసం చేస్తున్న శ్రీరంగరాజుపల్లికి చెందిన మొక్కజొన్న కమీషన్ ఏజెంట్ గోపాల్‌పై తూ.కొ.శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని శ్రీరంగరాజుపల్లికి చెందిన మొక్కజొన్న కమీషన్ ఏజెంట్ ఉప్పర గోపాల్ కొన్నేళ్లుగా మొక్కజొన్న వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఆదివారం పరిగి రైతు రాజీవ్‌రెడ్డికి చెందిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అప్పటికే రైతు రాజీవ్‌రెడ్డి తన దగ్గర ఉన్న స్కేలుపై 50 కేజీలకు పైగా తూకం పెట్టి, సంచుల్లో మొక్కజొన్న విత్తనాలు నింపాడు. అయితే గోపాల్ తెచ్చుకున్న ఎలక్ట్రానిక్ స్కేలుతో తూకం వేయగా తక్కువగా చూపాయి. ఇలా క్వింటాకు 20 కేజీలు తక్కువగా చూపడంతో రైతు రాజీవ్‌రెడ్డికి అనుమానం వచ్చింది. దీంతో అతను పరిశీలించగా...కమీషన్ ఏజెంట్ గోపాల్ తన ప్యాంటు జేబులో రిమోట్ ద్వారా ఎలక్ట్రానిక్ కాటాను ఆపరేట్ చేస్తూ తక్కువ తూకం చూపుతున్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా గోపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో గోపాల్‌పై పరిగి పోలీస్‌స్టేషన్‌లో రైతు రాజేష్‌రెడ్డితో పాటు మండలంలోని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే హిందూపురం తూనికల కొలతల శాఖ అధికారి శివశంకర్‌కూ ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం పరిగికి వచ్చిన ఆయన... గోపాల్‌ను స్టేషన్‌కు పిలపించి విచారించారు. ఎలక్ట్రానిక్ స్కేలుపై ఉంచిన ధాన్యాన్ని తూకం కంటే అధికంగా సేకరించే విధానాన్ని రిమోట్ ద్వారా ఎలా చేపట్టాడన్నది స్వయంగా గుర్తించారు. అనంతరం గోపాల్‌పై కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా తూనికలు, కొలతల్లో తేడా వస్తే 79890 05014 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment