పేదల భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే ఇష్టానుసారం మా భూములను వేరే వాళ్లకు రాసిస్తుంటే మేము ఎక్కడికి వెళ్లాలి. ఇంత జరుగుతున్నా అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకునే వారే లేకుండా పోయారు. ఇప్పటికై నా మా భూములు కబ్జాచేసిన వారిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలి. – రూల్పి బాయి, నార్శింపల్లి తండా
రక్షణ లేకుండా పోతోంది
అధికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై నార్శింపల్లిలో మేము నివసిస్తున్న స్థలాలు కబ్జా చేశారు. పేద గిరిజనులకు రక్షణ కరువైంది. అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. కలెక్టర్ చర్యలు తీసుకుని మా స్థలాలు మాకు దక్కేలా చూడాలి.
– కస్తూరి బాయి, నార్శింపల్లి తండా
అమరావతిలో ధర్నా చేస్తాం
నార్శింపల్లి తండా వాసులకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లాం. ఇప్పటికీ అధికారులు స్పందించకపోతే అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం. మా తండాను కబ్జా చేసిన వారిని శిక్షించే వరకు పోరాడతాం.
– చంద్రబాన్ నాయక్, నార్శింపల్లి తండా
Comments
Please login to add a commentAdd a comment