కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోండి
ప్రశాంతి నిలయం: దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న స్థలాన్ని కబ్జా చేసి ఆన్‌లైన్‌లో పేర్లు మార్చుకున్న వారితో పాటు వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నార్శింపల్లితండా వాసులు డిమాండ్ చేశారు. సోమవారం తండావాసులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, బుక్కపట్నం మండలం కొత్తకోట రెవెన్యూ గ్రామ పరిధిలోని నార్శింపల్లి తండా సర్వే నంబర్ 1030–2వ లెటర్‌లోని 5 ఎకరాలు భూమిని 1995లో అప్పటి ప్రభుత్వం తమకు ఇంటి పట్టాలు ఇవ్వగా, తాము ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నామన్నారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తకోటకు చెందిన టీడీపీ బూత్ కన్వీనర్ నగరి రాజేష్ బుక్కపట్నం తహసీల్దార్ షాబుద్దీన్, కిందిస్థాయి సిబ్బందితో కుమ్మకై ్క తమ భూములు కబ్జా చేశాడన్నారు. రెవెన్యూలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ పేర్లు మార్పుచేసుకోవడంతో పాటు తాముంటున్న స్థలాలకు 1–బీ, పాసుబుక్కు చేయించుకున్నారన్నారు. ఈ విషయం పత్రికల్లో వచ్చినా రెవెన్యూ అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని వాపోయారు. కబ్జాదారులతో కుమ్మకై ్కన రెవెన్యూ అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, టీడీపీ నాయకులు నగిరి రాజేష్ పేరిట మంజూరు చేసిన ఆన్‌లైన్ రికార్డును, 1–బి, పాసుస్తుకాలను రద్దు చేయాలన్నారు. అలాగే రాజేష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ టీఎస్ చేతన్‌ను కలసి, విషయాన్ని వివరిస్తూ ఆధారాలను చూపించారు. కార్యక్రమంలో నార్శింపల్లి తండాకు చెందిన వందమందికిపైగా పాల్గొన్నారు.
సహకరించిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి
కలెక్టరేట్ ఎదుట నార్శింపల్లి
తండా వాసుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment