ఆర్టీఓ కార్యాలయం.. అ‘సత్య’ ప్రచారం..!
ధర్మవరం ఆర్టీఓ కార్యాలయం గతంలోనే ఏర్పాటై ప్రారంభం కాగా, అప్పట్లో రవాణాశాఖ అధికారులు సెబ్ విధులు కూడా చూసే వారు. ఈ క్రమంలో ఆర్టీఓ సేవలకు సంబంధించిన కోడ్ మంజూరు కాలేదు. అయినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించి తాత్కాలికంగా కదిరి ఆర్టీఓ కోడ్ 8302తో వారానికి రెండు రోజులు ధర్మవరంలో ఆర్టీఓ కార్యకలాపాలు జరిగేలా చూశారు. అయితే ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఆర్టీఓ కోడ్ రావడం జాప్యమైంది. తాజాగా అప్పట్లో ఏర్పాటైన ఆర్టీఓ కార్యాలయానికి ధర్మవరం కోడ్ 80602ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తామే ధర్మవరానికి ఆర్టీఓ కార్యాలయాన్ని తెచ్చినట్లుగా సోమవారం మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సత్యకుమార్‌తో పాటు కూటమి నేతలు గొప్పలు పోవడాన్ని ప్రజలే తప్పుబట్టారు. – ధర్మవరం
నాడు ప్రజల కోసం..
నేడు ప్రచార పర్వం
Comments
Please login to add a commentAdd a comment