కూటమి ప్రభుత్వం ‘బెల్టు’ తీసింది. పల్లెకు నిషా ఎక్కిస్త
చిలమత్తూరు/లేపాక్షి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు తమ్ముళ్లు మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఊరూరా ఏరులై పారిస్తూ జేబులు నింపుకుంటున్నారు. చిలమత్తూరు మండలానికి సంబంధించి ప్రభుత్వం ఒక మద్యం షాపునకు అనుమతి ఇవ్వగా.. అనధికారికంగా మరో షాపును నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే తొలుత కొడికొండ చెక్‌పోస్ట్‌లో మద్యం దుకాణం ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించారు. అయితే తాజాగా అదే మద్యం దుకాణాన్ని చిలమత్తూరుకు మార్చుకుంటున్నట్లు అధికారులు తెలిపి చిలమత్తూరులో మద్యం దుకాణం తెరిచారు. ఇప్పుడు అటు చెక్‌పోస్టులోనూ, ఇటు చిలమత్తూరులోనూ అధికారికంగానే మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. హిందూపురం రూరల్ మండలంలోని తూముకుంట, కిరికెర గ్రామాల్లోనూ ఇలానే ఒక దుకాణానికి అనుబంధంగా మరోచోట దుకాణం ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రామానికో బెల్టుషాపు ఏర్పాటు చేసి పల్లెల్లో మద్యాన్ని పారిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక మద్యానికి అలవాటు పడిన వారికోసం ఆ రాష్ట్ర మద్యాన్ని కూడా బెల్టు షాపుల ద్వారా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
బెల్టుషాపులు షురూ..
కర్ణాటక సరిహద్దులో ఉన్న చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపగా, ఇప్పుడు గ్రామ గ్రామానా బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. మద్యం అక్రమ రవాణా కూడా జోరుగా సాగుతుండటంతో చిలమత్తూరు చిల‘మత్తు’రుగా మారిపోయింది.
ఎకై ్సజ్‌శాఖ కనుసన్నల్లోనే అమ్మకాలు..!
ఒక దుకాణానికి అనుమతి పొంది రెండు, మూడు చోట్ల విక్రయాలు సాగించడం, గ్రామానికో బెల్టుషాపు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్న విషయాలు తెలిసినా ఎకై ్సజ్ శాఖ అధికారులు తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 3న అక్రమాలకు ‘హాయి’ వే శీర్షికన మద్యం అక్రమ రవాణా, బెల్టు షాపుల నిర్వహణపై సాక్షిలో కథనం ప్రచురితం కాగా, 13న ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య కొడికొండ చెక్‌పోస్ట్‌లోని తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. అప్పటికే రెండు చోట్ల మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఎకై ్సజ్ శాఖ స్థానిక అధికారులు వెంటనే కొడికొండ చెక్‌పోస్ట్‌లోని మద్యం దుకాణాన్ని బంద్ చేయించారు. ఆ తర్వాత యథావిధిగా అమ్మకాలు జరిపారు.
కాసుల కోసం తమ్ముళ్ల గ‘మ్మత్తు’ దందా
చిలమత్తూరులో ఒక షాపుకు అనుమతి..
రెండు ప్రాంతాల్లో దుకాణాల నిర్వహణ
లేపాక్షి మండలంలో 46 బెల్టు షాపులు
ఎకై ్సజ్ శాఖ కనుసన్నల్లో వ్యవహారం
చిన్నాభిన్నమవుతున్న పేదల జీవితాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
చిలమత్తూరు మండలంలో మద్యం దుకాణం ఒక్కటే ఉంది. అది కూడా చిలమత్తూరులోనే ఉంది. మరెక్కడా లేదు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం ఏర్పాటు చేసి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అలాగే బెల్టుషాలపై నిఘా ఉంచాం. ఎవరైనా బెల్టుషాపు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– లక్ష్మీదుర్గయ్య, ఎకై ్సజ్ సీఐ, హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment