‘పోరుబాట’ను విజయవంతం చేయండి
పరిగి: విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఆరు నెలల్లోనే సర్దుబాటు పేరుతో ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టిందన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘పోరుబాట’ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం పరిగిలో పర్యటించిన ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ‘పోరుబాట’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అలవిగాని హామీలిచ్చిన కూటమి పార్టీల నేతలు... అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కహామీని అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ముఖ్యంగా విద్యుత్ చార్జీల పెంపుతో సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై మోయలేని భారాన్ని మోపారన్నారు. కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీల బాదుడుపై నిరసనగా వైఎస్సార్‌సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో విద్యుత్ శాఖ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. పార్టీ శ్రేణులతో పాటూ ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్ పిలుపు
Comments
Please login to add a commentAdd a comment