అంబరం.. క్రిస్మస్ సంబరం
మానవులను రక్షించేందుకు భువిపై లోకరక్షకుడు ఉద్భవించిన క్రిస్మస్ పర్వదినాన్ని బుధవారం జిల్లా వాసులు ఘనంగా జరుపుకున్నారు. హిందూపురం, కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర తదితర ప్రాంతాల్లోని చర్చిలలో ఉదయమే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు భారీగా తరలిరావడంతో చర్చిలన్నీ కిటకిటలాడాయి. క్రీస్తు జనన వృత్తాంతం, ఆయన బోధించిన ప్రేమ, కరుణ, త్యాగాన్ని పాస్టర్లు వివరించారు. చర్చీల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలు, పశువుల పాకలు ఆకట్టుకున్నాయి. పలు చోట్ల సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి చాటారు.
– సాక్షి బృందం, శ్రీసత్యసాయి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment