గోవాను తలపిస్తున్న లేపాక్షి..
లేపాక్షి మండలంలో ఊరూరా బెల్టు దందా నడుస్తుండటంతో గోవాను తలపిస్తోంది. లాటరీ ద్వారా మద్యం దుకాణం దక్కించుకున్న వ్యక్తిపై దాడులు చేసి మరీ దుకాణాన్ని దౌర్జన్యంగా దక్కించుకున్న టీడీపీ నేతలు... ఆ దుకాణానికి అనుబంధంగా ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అనుమతిచ్చిన మద్యం దుకాణంలోనే క్వార్టర్‌పై రూ. 20 నుంచి 30 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక మండలంలో గ్రామానికో బెల్టు దుకాణం చొప్పున 42 మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి గమ్మత్తు దందా జోరుగా నడుపుతున్నారు. ఒక్కో బెల్టుషాపు ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే రెండు, మూడు బెల్టు షాపులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ క్వార్టర్ మద్యంపై రూ.50 నుంచి రూ.70 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు మద్యం మత్తులో జోగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
● కోడిపల్లి పంచాయతీ పరిధిలోని నాగేపల్లి–కోడిపల్లి మధ్య ఉన్న రహదారి పక్కనే బెల్టుషాపు ఏర్పాటు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్‌కు దీటుగా లైటింగ్, డీజే సౌండ్‌లతో బెల్టుషాపును నిర్వహిస్తున్నారు. అలాగే మండలంలోని చాలా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, మెయిన్ రోడ్లకు సమీపంలోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment