సూచనలతో సరిపెడుతున్న అధికారులు..
గుడిబండకు చెందిన శ్రీరాములు వెన్నెముక సమస్యతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీరు తాగడం వల్ల సమస్య తలెత్తినట్లు వెల్లడించారు.
గాండ్లపెంటకు చెందిన
నారాయణప్ప కీళ్ల నొప్పులతో కదిరి ఏరియా ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు చేసిన వైద్యులు రసాయనాలు ఎక్కువగా కలిసిన నీటిని తాగడం వల్లే ఎముకలు
అరిగిపోయినట్లు తెలిపారు.
జిల్లాలోని చాలా గ్రామాలను ఫ్లోరైడ్ భూతం పట్టిపీడిస్తోంది. కదిరి రెవెన్యూ డివిజన్‌తో పాటు మడకశిర నియోజవర్గంలోనూ ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. గుడిబండ మండల పరిధిలోని కెఎన్ పల్లి, హిరేతుర్పి, కరికెర తదితర గ్రామాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది. ఈ నీటిని తాగుతున్న వారి పళ్లు రంగు మారి, ఎముకల్లో దృఢత్వం తగ్గి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుట్టిన పిల్లలకూ ఎదుగుదల లేకుండా పోయింది. ఇప్పటికే చాలా గ్రామాల్లోని వారు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
...ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా మంది మోకాళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. పరిమితికి మించి భూగర్భజలాలను
తోడేస్తుండటంతో తాగునీరులో ఫ్లోరైడ్, నైట్రేట్, ఆర్సెనిక్ తదితర
రసాయనాల శాతం పెరుగుతోంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో
వాటర్ ప్లాంట్‌లో శుద్ధి చేసిన జలంలోనూ రసాయనాల శాతం
ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
సాక్షి, పుట్టపర్తి
జిల్లాలో పలు చోట్ల భూగర్భ జలాలు ప్రమాదకరంగా మారాయి. రసాయనాలు కలవడంతో తాగే జలం కూడా గరళంగా మారింది. భూగర్భ జల నాణ్యత నివేదికలో ఇది తేటతెల్లమైంది. 2023లో నైరుతి రుతుపవనాలు రాక ముందు.. వర్షాలు కురిసిన తదనంతరం దేశవ్యాప్తంగా రెండుసార్లు భూగర్భ జలాలను కేంద్ర భూగర్భ జల మండలి సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించింది. ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలతో ‘వార్షిక భూగర్భ జలాల నాణ్యత నివేదిక – 2024’ను విడుదల చేసింది. ఆ నీటిలోని రసాయన అవశేషాలు, వాటి కారణంగా ఎదురయ్యే సమస్యలను వివరించింది.
ఫ్లోరైడ్ జిల్లాల జాబితాలో శ్రీసత్యసాయి..
భూగర్భ జల నాణ్యత నివేదికలో జిల్లాలో పలు చోట్ల ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్‌తో పాటు ఆర్సెనిక్ అనే రసాయన అవశేషాలు ఉన్నట్లు తేలింది. దేశంలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న తొలి 15 జిల్లాల్లో శ్రీసత్యసాయి 10వ స్థానంలో ఉంది. జిల్లాలో సగటున 31.76 శాతంగా ఫ్లోరైడ్ ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. నమూనాల్లో లీటరు నీటికి 1.5 ఎంజీ మించి ఫ్లోరైడ్ కనిపించినట్లు పేర్కొన్నారు.
పరిమితికి మించి ఫ్లోరైడ్..
జిల్లాలోని భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు కేంద్ర భూగర్భ జల మండలి నివేదికలో వెల్లడైంది. సాధారణంగా లీటరు నీటిలో 1.5 ఎంజీలోపే ఫ్లోరైడ్ ఉండాలి. కానీ పలు ప్రాంతాల్లో 2 ఎంజీ కి మించి.. ఇంకొన్ని చోట్ల గరిష్టంగా 5 ఎంజీ మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ నీటిని తాగితే ఫ్లోరోసిస్, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 98 ిఫిజోమీటర్ల ద్వారా భూగర్భ జలాలు సేకరించి ఫ్లోరైడ్ పరీక్షలు నిర్వహించగా.. 72 చోట్ల ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఫలితంగా తాగునీటి విషయంలో అందరూ ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన పరిస్థితి నెలకొంది.
అత్యధిక నైట్రేట్‌తో ఆరోగ్య సమస్యలు..
జిల్లాలోని పలు ప్రాంతాల్లోని జలాల్లో నైట్రేట్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సాధారణంగా లీటరు నీటిలో 45 ఎంజీ కంటే ఎక్కువ నైట్రేట్ ఉండకూడదు. కానీ పలు చోట్ల మోతాదుకు మించి 60 ఎంజీ వరకు నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. నైట్రేట్ అధికంగా ఉన్న నీటిని తాగితే మహిళలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భస్త సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, పురుషులు అల్సర్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఆర్సెనిక్‌తోనూ సమస్యలే..
లీటరు నీటిలో ఆర్సెనిక్ అనే రసాయనం 0.01 ఎంజీ వరకూ ఉండవచ్చు. అయితే జిల్లాలో చాలా చోట్ల సాధారణం కంటే అధికంగా ఉంది. గరిష్టంగా కొన్ని ప్రాంతాల్లో 19 ఎంజీగా కూడా ఉన్నట్లు తేలింది. ఆర్సెనిక్ అధికంగా ఉన్న నీటిని తాగడం వల్ల ఆర్సెనికోసిస్ అనే వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా లంగ్ క్యాన్సర్, డయాబెటీస్, గుండె, రక్తనాళాలు దెబ్బతినడం, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక ఐరన్‌తోనూ ముప్పే..
లీటరు నీటిలో 1 ఎంజీ మాత్రమే ఐరన్ ఉండాలి. అయితే జిల్లాలో చాలా చోట్ల 2 ఎంజీ వరకు ఐరన్ ఉన్నట్లు కేంద్ర భూగర్భ జల మండలి నివేదికలో తేలింది. తాగునీటిలో ఐరన్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటే తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఐరన్ అధికంగా ఉండే నీటిని తాగితే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
గాండ్లపెంట మండలం గాజువారిపల్లిలో నమోదైన ఫ్లోరైడ్ శాతం
60.4 ఎంజీ
గుడిబండ మండలం కుమ్మరనాగేపల్లిలో నమోదై నైట్రేట్ శాతం
228
ప్రభుత్వం ద్వారా డయాలసిస్
పింఛన్ పొందుతున్న వారి సంఖ్య
పల్లెల్లో ఫ్లోరైడ్ భూతం..
జిల్లాను పీడిస్తున్న ‘ఫ్లో’రైడ్ బూతం
తాగునీటిలో మోతాదుకు మించి
రసాయన అవశేషాలు
రోగాల బారిన పడుతున్న జనం
జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు
తాగునీటిలో రసాయనాల శాతం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫ్లోరైడ్ 1.20 శాతానికి మించి ఉంటే ఆ బోరు ప్లాంటును ఫ్యూరిఫై చేయాలి. అప్పటికీ ఫ్లోరైడ్ శాతం తగ్గకపోతే ఆ బోరును మూసివేసి ప్రత్యామ్నాయంగా మరో బోరు ఏర్పాటు చేయాలి. కానీ అధికారులు మాత్రం కేవలం బోర్లలో నీరు వాడుకోవద్దని, ఫ్యూరిఫైడ్ వాటర్ తాగాలంటూ ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో గ్రామాల్లోని జనం బోర్ల నీటినే వినియోగిస్తూ రోగాల బారిన పడుతున్నారు.
మినరల్ వాటరే తాగుతున్నాం
మా గ్రామంలో 50 కుటుంబాలున్నాయి. గతంలో మేమంతా బోరు నీటినే తాగేవాళ్లం. అయితే ఆ నీరు తాగడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులు ఎక్కువయ్యాయి. అధికారులు వచ్చి నీళ్లలో ఫ్లోరైడ్ ఉంది తాగకండి అని చెప్పి వెళ్లారు. ప్రస్తుతం మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం.
– రామలక్ష్మమ్మ, గాజులవారిపల్లి,
గాండ్లపెంట మండలం
Comments
Please login to add a commentAdd a comment