పచ్చ నేతల దౌర్జన్యకాండ
పెనుకొండ: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. అధికారం అండతో దందాలు, దౌర్జన్యాలతో దుర్మార్గాలకు తెగబడుతున్నారు. తాజాగా సోమందేపల్లిలో ఓ దళిత కుటుంబానికి చెందిన భూములు కబ్జా చేశారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఆ కుటుంబంపై దాడులు చేసి వెళ్లగొట్టారు.
ఏడు దశాబ్దాల నుంచి అనుభవంలో ఉన్నా..
సోమందేపల్లికి చెందిన దళితుడు ముత్యాలు.. ముత్తాత 70 ఏళ్ల క్రితం గ్రామంలో వెట్టిగా పనిచేసేవారు. దీంతో ప్రభుత్వం ఆయనకు సోమందేపల్లి సమీపంలో మూడు ఎకరాల అసైన్డ్ భూములకు పట్టా ఇచ్చింది. అప్పటి నుంచి తరతరాలుగా ముత్యాలు కుటుంబీకులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ భూమి జాతీయ రహదారికి పక్కనే ఉండటం ఇప్పుడు రూ.కోట్లు పలుకుతుండటంతో టీడీపీ నేతల కన్ను దానిపై పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొందరు టీడీపీ నేతలు బాధితుడు ముత్యాలును భయభ్రాంతులకు గురిచేసి ఎకరా తమ పేర రాయించుకున్నారు. దీంతో మరికొందరు నేతలు మిగతా రెండు ఎకరాలు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు.
ఫెన్సింగ్ వేసి..దళితులను వెళ్లగొట్టి..
పెనుకొండకు చెందిన రామలింగ చౌదరి, వెంకటనారాయణచౌదరి తదితరులు ఆధ్వర్యంలో శుక్రవారం సోమందేపల్లి మండల కన్వీనర్ సిద్ధలింగప్ప, తెలుగు యువత నాయకుడు వడ్డే సూరి, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, ఆంజనేయులుతో పాటు వందల మంది ముత్యాలు పొలం వద్దకు వచ్చారు. చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అనంతరం ముత్యాలు కుటుంబీకులపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. మరోసారి ఇక్కడికి వస్తే చంపేస్తామని బెదిరించారు. భయంతో కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయిన ముత్యాలు రాత్రి మీడియా ముందుకు వచ్చి దారుణాన్ని వివరించారు.
సోమందేపల్లిలో దళితుల భూమి కబ్జా
భూమి చుట్టూ ఫెన్సింగ్..
భూ యజమానులపై దాడి
రహస్య ప్రాంతంలో
తలదాచుకుంటున్న బాధితులు
Comments
Please login to add a commentAdd a comment