దళిత మహిళలపై దాడి
తనకల్లు: మండలంలోని దిగువ బత్తినవారిపల్లికి చెందిన దళిత మహిళలు జ్యోతి, లక్ష్మీనరసమ్మపై దాడి చేసిన కోలా నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు. పొలం దారి విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం ఉంది. ఈ క్రమంలో బుధవారం జ్యోతి, నరసమ్మ బోరు వద్దకు వెళుతుండగా మధ్యలో దారి కాచిన నాగరాజు, నాయన భార్య గొడవపడి కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. గాయపడిన జ్యోతి, లక్ష్మీనరసమ్మను స్థానికులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఆరుద్ర శ్రీనివాసులు, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్ గంగులయ్య, రైతు సంఘం నాయకులు శివన్న తదితరులు బాఽధితులతో కలసి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment