ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయాం
బుధవారం ఉదయం కేంద్ర కరువు బృందం ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లి గ్రామంలో పర్యటించింది. బృందం సభ్యులు జయంతి కనోజియా, డాక్టర్ కె.పొన్నుస్వామి జిల్లా అధికారులతో కలిసి కంది, అలసంద, వేరుశనగ తదితర పంటలను పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు కరువు బృందం ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు కురవక దిగుబడి అందక ఏటా నష్టాలను చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఖరీఫ్‌లోనూ ప్రకృతి వైపరీత్యాలతో పంటలన్నీ కోల్పోయామని, కేంద్రం ఆదుకునేలా చూడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment