కార్యకర్తలను కాపాడుకుంటాం
రొద్దం: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ కాపాడుకుంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీచరణ్ స్పష్టం చేశారు. బుధవారం రొద్దం మండలంలో ఆమె పర్యటించారు. ఆర్.నాగిరెడ్డిపల్లిలో ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సోషల్ మీడియా కార్యకర్త నగరూరు బాలాజీరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్య, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. బాలాజీరెడ్డిని అరెస్ట్ చేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి సవిత అక్రమాలకు తెరలేపారన్నారు. రొద్దం గ్రామానికి చెందిన దివ్యాంగుడు షరీఫ్ కుటుంబానికి సంబంధించిన భూమిని మంత్రి అండతోనే ఆమె అనుచరుడు కబ్జా చేశాడని ఆరోపించారు. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళితే... దివ్యాంగుడని కూడా చూడకుండా ఎస్‌ఐ పరుషపదజాలంతో దూషణలకు పాల్పడడం బాధాకరమన్నారు. పెనుకొండ కౌన్సిలర్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డికి సంబంధించిన స్థలంలో దౌర్జన్యంగా రోడ్డు వేయించారన్నారు. ప్రజలతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్షకట్టి వేధిస్తున్న సవితకు కౌంట్ డౌన్ మొదలైందన్నారు.
మరోసారి నోరుజారితే ఊరుకోం
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవిత.. బీసీలకు మేలు చేసే అంశాల కన్నా... వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేసేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. మరోసారి జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడితే చూస్తూ ఉరుకోబోమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తిమ్మయ్య, సర్పంచ్ రాము, నాయకులు ఎన్.నారాయణరెడ్డి, బోయ నరసింహులు, లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణరెడ్డి, వైశాలి జయప్పరెడ్డి, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.
మంత్రి సవితకు కౌంట్ డౌన్ మొదలైంది
మాజీ మంత్రి ఉషశ్రీచరణ్
సోషల్ మీడియా కార్యకర్త
బాలాజీరెడ్డి కుటుంబానికి పరామర్శ
పార్టీ అధినేత పంపిన రూ.లక్ష చెక్కు అందజేత
Comments
Please login to add a commentAdd a comment