చెవి రింగులు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదర
● అరటి నుండి అందమైన ఉత్పత్తులు ● హస్తకళలకు లేపాక్షి ఎంపోరియం బాసట
అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లాలో అరటి సాగు చేసే రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే అరటి గెలలను మార్కెటింగ్ చేసిన తర్వాత ఆ చెట్లను కొట్టేసి పడేయడం తప్ప రైతులకు మరో అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి అరటి చెట్టు తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దిగుబడి ఇస్తుంది. ఆ తరువాత అది వ్యర్థంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆ చెత్తను తొలగించడం కూడా రైతులకు పెద్ద సమస్యగానే ఉంటోంది. రైతులు వృథాగా పడేసే అరటి బోదెలతో పలు రకాల ఉపఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపించడమే కాకుండా వాటి తయారీలో పలువురికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
‘ఒక జిల్లా – ఒక క్రాఫ్టు’తో వెలుగులోకి
జిల్లా విభజన అనంతరం ‘అనంత’కు మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. జిల్లాలో 10 వేల హెక్టార్లలో అరటి సాగులో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వన్ డిస్ట్రిక్– వన్ క్రాఫ్ట్ కింద ‘బనానా ఫైబర్’ (అరటి నార)తో అందమైన గృహోపకరణాల తయారీని అనంతపురం జిల్లాకు కేటాయించింది. ఈ ఉత్పత్తులకు లేపాక్షి హస్తకళల సంస్థ అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించడమే కాక అదే స్థాయిలో విక్రయాలను ప్రోత్సహిస్తోంది. అరటి బెరడు నార తీసి దానితో ఎన్నో వస్తువులను తయారు చేయగల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కూడేరు, అనంత నగర శివారులో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను నెలకొల్పారు. అరటి వ్యర్థాల నుంచి కళాత్మక వస్తువుల తయారీపై వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన ‘మూసా ఫైబ్రల్’ సహకారంతో శిక్షణ అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment