సచివాలయ ఉద్యోగులకు చార్జ్‌మెమో
● 11 గంటలైనా తెరచుకోని
తంబాపురం సచివాలయం
● ఫొటో తీసి వాట్సాప్ ద్వారా
ఎంపీడీఓకు పంపిన గ్రామస్తుడు
బత్తలపల్లి: సమయపాలన పాటించని తంబాపురం గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమోలు జారీ చేశారు. ఉదయం 9 గంటలకే విధుల్లో ఉండాల్సిన వారు 11 గంటలైనా అందుబాటులోకి రాకపోవడంతో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు చర్యలు ఉపక్రమించారు.
తలుపుకూడా తీయకపోవడంతో..
ఆధార్ అప్‌లోడ్ చేసుకునేందుకు పలువురు స్థానికులు సోమవారం ఉదయం 10 గంటలకే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే 9 గంటలకే కార్యాలయానికి హాజరుకావాల్సిన ఉద్యోగులు ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదు. 11 గంటలవుతున్నా సచివాలయం తలుపులు తెరిచేవారు కనిపించకపోవడంతో... గ్రామస్తులు ఫొటోలు తీసి ఎంపీడీఓ కార్యాలయానికి వాట్సాప్ ద్వారా పంపారు. స్పందించిన ఏఓ శ్రీనివాసులు విషయంపై ఆరా తీశారు. సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నా ఒక్కరూ విధులకు హాజరు కాలేదని తెలిసి అందరికీ చార్జ్ మోమో ఇచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది ఇచ్చే వివరణతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment