హర్యానా మద్యం పట్టివేత
హిందూపురం అర్బన్: అక్రమంగా జిల్లాలోకి తరలిస్తున్న హర్యానా మద్యాన్ని ఎకై ్సజ్ అధికారలు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు సోమవారం శిర– కొడికొండ జాతీయ రహదారిపై కొల్లకుంట క్రాస్ వద్ద ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవిందనాయక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ నరసింహులు ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన మారుతీ సుజికి వ్యాగనర్ కారులో హర్యానా రాష్ట్రానికి చెందిన వివిధ బ్రాండ్ల మద్యం 90 బాటిళ్లు పట్టుబడింది. మద్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో హిందూపురం మండలం సుబ్బిరెడ్డిపల్లికి చెందిన శ్రీనాథ్, ముద్దిరెడ్డిపల్లికి చెందిన గురిజాల బాలేంద్ర, దాసరి నవీన్ ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment