సోమందేపల్లి: నకిలీ బంగారం అమ్మేందుకు ప్రయ త్నిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదివారం రాత్రి సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామ సమీపంలో ఎనిమిది మంది బంగారం అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వారిని పెనుకొండ పీఎస్‌కు తరలించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
కిడ్నాప్ కలకలం
సోమందేపల్లి: మండల కేంద్రం సమీపంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ఓ హోటల్ కార్మికుడిని హిందూపురానికి చెందిన వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. హిందూపురానికి చెందిన అశోక్ రూ.40వేలు అప్పుగా తీసుకుని చెల్లించకుండా ముఖం చాటేసి సోమందేపల్లికి వచ్చి ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలుసుకున్న వడ్డీ వ్యాపారులు అందరూ చూస్తుండగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. పెనుకొండ వరకూ వెళ్లిన తర్వాత తిరిగి స్థానిక పీఎస్‌కు చేరుకుని అశోక్‌ను అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment