సత్ప్రవర్తన అలవర్చుకోండి
ధర్మవరం అర్బన్: సత్ప్రవర్తన అలవర్చుకోవాలని సబ్ జైలులోని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.శివప్రసాద్‌యాదవ్ సూచించారు. సోమవారం ధర్మవరంలోని సబ్‌జైలును ఆయన తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూం, బ్యారక్‌లు, రికార్డులు పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కోర్టు కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాది లేని వారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ బ్రహ్మేంద్రరెడ్డి, న్యాయవాదులు కృష్ణమూర్తి, బాలసుందరి, పారా లీగల్ వలంటీర్ షామీర్‌బాషా పాల్గొన్నారు.
● పెనుకొండ: స్థానిక సబ్‌జైల్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్‌యాదవ్ సోమవారం తనిఖీ చేసారు. బ్యారెక్‌లు, మరుగుదొడ్లు, వంటగది, స్టోర్‌రూం, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి భార్యాపిల్లలతో సంతోషంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో సబ్‌జైల్ సూపరింటెండెంట్ అజగర్ హుస్సేన్, ప్యారా లీగల్ వలంటీర్ నరసప్ప, పెనుకొండ, అనంతపురం కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.
● హిందూపురం అర్బన్: క్షణికావేశంలో తప్పులు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరూ అధికారుల దృష్టిలో ఒక్కటేనని జిల్లా సివిల్ జడ్జి శివప్రసాద్ యాదవ్ అన్నారు. సోమవారం స్థానిక ఉప కారాగారాన్ని ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, న్యాయవాది సంతోషికుమారి, ఉపకారాగార అధికారి హనుమన్న, లోక్ అధాలత్ సిబ్బంది హేమావతి, పారా లీగల్ వలెంటీర్ సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment