గంజాయి ముఠా అరెస్టు
కదిరి టౌన్: గంజాయి రవాణా చేసి 9 మంది సభ్యులుగల ముఠాను ఎన్‌పీకుంట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శివనారాయణ స్వామి కదిరి రూరల్ పోలీసు స్టేషన్‌లో విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన బాలాజీ అల్లురి సీతారామరాజు జిల్లాకు చెందిన అర్జున్ నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తుంటారు. ఇందుకోసం 8 మందితో ఓ ముఠా ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా సోమవారం గంజాయి ముఠా సభ్యులు ఎన్‌పీకుంట మండలానికి గంజాయి రవాణా చేస్తుండగా... ఎన్‌పీకుంట ఎస్‌ఐ వలీబాషా తన సిబ్బందితో కలిసి వలపన్ని బాలాజీతో పాటూ మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షలు విలువ చేసే 5 గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
రూ.1.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment