వైద్య బృందం.. సర్వసన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

వైద్య బృందం.. సర్వసన్నద్ధం

Published Thu, Oct 24 2024 12:58 AM | Last Updated on Thu, Oct 24 2024 5:25 PM

-

అరసవల్లి: దానా తుఫాన్‌ తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున జిల్లాలో ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లో తక్షణ వైద్య సాయం అందించేందుకు వైద్యబృందమంతా సన్నద్ధంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.మీనాక్షి ఆదేశించారు. బుధవారం పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ ఆశా, ఏఎన్‌ఎంలతో సర్వే చేయించి పారిశుద్ధ్యం, తదితర పరిస్థితులను పంచాయతీ అధికారులకు తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. 

తుఫాన్‌ తీవ్రత తగ్గే వరకు వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సెలవులన్నీ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 24గంటలూ విధుల్లో ఉండేలా ప్రణా ళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షం అనంతరం పల్లెల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా బావుల్లో క్లోరినేషన్‌ చేయించాలని ఆదేశించారు. డయేరియా తో విజయనగరం జిల్లా గుర్లమండలంలో దారు ణం జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా నీటి పరీక్షలు చేయించాలన్నారు. 

సచివాలయానికి రెండేసి చొప్పున మొత్తం 1000 పరీక్షలను టార్గెట్‌గా నిర్దేశించినట్లు వివరించారు. గర్భిణులను గుర్తించి సమీపంలో సీహెచ్‌ిసీలకు తరలించాలని సూచించారు. విద్యుత్‌ అంతరాయం కలిగితే వ్యాక్సిన్లు భద్రపరిచేందుకు ముందుగానే జనరేటర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం ద్వారా దానా తుపాను తీవ్రతను ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement