మోసం గురూ..
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవ అని మార్చారు. నగదు సాయం మొత్తాన్ని పెంచుతామని మాటిచ్చారు. ఆ మేరకు ఊరూరా తిరిగి మైకుల్లో ప్రచారం చేశారు. ఇంటింటికీ కాగితాలు ప్రింట్ చేసి మరీ ఇచ్చారు.. అంతే అక్కడితో టీడీపీ నాయకుల కసరత్తు ఆగిపోయింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మర్చిపోయారు. దమ్ములు, ఉభాలు, కలుపు తీత, ఆఖరకు కోతలు కూడా పూర్తయిపోతున్నా.. అన్నదాత సుఖీభవ పథకంలో దమ్మిడీ కూడా విడుదల చేయలేదు. ఈ సాయమే కాదు ఎరువులు, విత్తనాల పంపిణీలోనూ రైతన్నకు నిలువెత్తున మోసం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3.13 లక్షల మంది రైతులకు గాను రెండు విడతలు కలిపి రూ.235కోట్లు బకాయి పడ్డారు. ఈ ఏడాది మూడు విడతలుగాను మొత్తంగాను రూ.423కోట్లు బకాయిపడే అవకాశం ఉంది.
కేంద్రం ఇస్తున్నా..
ఖరీఫ్ సాగు సమయంలో మొత్తం రెండు విడతలుగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం తన వాటాగా రెండు విడతలు రూ.4వేలు చొప్పున డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నగదుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీనిపై చంద్రబాబు సర్కారు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా విడుదల కాకపోవడంతో ఆశలు ఆవిరైనట్లేనని అన్నదాత ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో అలా..
ఖరీఫ్ సీజన్ లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గత వైఎస్ జగన్ సర్కార్ సాగుకు ముందే పెట్టుబడి సాయం ఆందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ఇందులో కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే రూ.6 వేలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7,500 కలిపి మొత్తంగా రూ.13,500 చొప్పున ఒక్కో రైతు ఖాతాలో జమ చేసేది. జిల్లాలో 3.22లక్షల మంది రైతులుండగా గత ఐదేళ్లలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ 1983.73కోట్లు లబ్ధి అందించింది. ఖరీఫ్ పంట వేసేముందు ఏటా సరిగ్గా మే నెలలో రూ.7,500
రైతన్నను ఆదుకుంటాం
రైతును అన్ని రకాలుగా ఆదుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ చేస్తాం. ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగింది.
– కోరాడ త్రినాథస్వామి,
జిల్లా వ్యవసాయాధికారి
మోసకారి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల్ని మోసం చేస్తునే వస్తుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే రైతుల ఖాతాల్లో రెండు విడతలు డబ్బులు జమయ్యేవి. ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు లేకపోవడం దారుణం.
– నక్క ఆనందరావు, రైతు, హిరమండలం
జమ చేసేది. తర్వాత అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట కోతతో పాటు రబీ సాగు అవసరాల కోసం రెండో విడతలో రూ.4 వేలు ఇచ్చేది. ఆ తర్వాత జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు... ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ ద్వారా మొత్తం రూ.13,500 చొప్పున గత ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్ రైతు భరోసా పథకంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇలా అనేక పథకాల ద్వారా గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.
సంవత్సరం
రైతుల సంఖ్య (లక్షల్లో)
లబ్ధి (రూ.కోట్లలో)
వైఎస్సార్‌సీపీ
5 ఏళ్లలో రైతులకు
చేకూర్చిన లబ్ధి
న్యూస్‌రీల్
రైతన్నకు అందని అన్నదాత సుఖీభవ
రెండు విడతలకు గాను రూ.235కోట్లు బకాయి
జిల్లా వ్యాప్తంగా 3.13లక్షల మంది రైతులకు
అందని సాయం
ఖరీఫ్ ముగిసినా పైసా విదల్చని కూటమి ప్రభుత్వం
రైతంటే చిన్నచూపు తగదు
రైతుకు విత్తనం వేసిన నుంచి పంట చేతికి వచ్చినంత వరకు భయం భయంగానే ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో అలాంటి భయం ఉండేది కాదు. పంటలు వేసేందుకు దుక్కిన నాటి నుంచి కోత కోసిన వరకు అన్ని సందర్భాల్లో ప్రభుత్వం రైతుభరోసా పేరిట డబ్బులు వేసి చేయూతనిచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చి ఖరీఫ్ సీజన్ పూర్తయినా నేటికి దిక్కులేదు.
– ఇసురు యాదవరెడ్డి, ఇన్నిసుపేట, ఇచ్ఛాపురం మండలం
2019-20
2022-23
2021-22
2023-24
2020-21
3.07
2.58
2.91
3.10
3.21
414.57
348.50
393.14
393.52
434
Comments
Please login to add a commentAdd a comment