జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే అజెండా
● అందరం
కలిసికట్టుగా పనిచేద్దాం
● వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త
చింతాడ రవికుమార్
ఆమదాలవలస: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయడమే అజెండాగా, పార్టీ క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేద్దామని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పిలుపునిచ్చారు. ఆమదాలవలసలోని జగనన్న ప్రజాసేవా కార్యాలయం ఆవరణలో శుక్రవారం పార్టీ క్యాడర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం నోరు నొక్కుతోందని, ఎంత అణగదొక్కి నా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ అ ధిష్టానం నియోజకవర్గానికి సముచిత స్థానం క ల్పించిందని పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కేవీజీ సత్యనారాయణ, నియోజకవర్గ సమన్వయకర్తగా తనను నియమించడమే అందుకు నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే అధికారం చేపట్టిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం, బదిలీలు చేయించడం, రాజకీయ కక్షతో పింఛన్లు తొలగింపు చేయడం మాత్రమే చేశా రని దుయ్యబట్టారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ అధిష్టానం సూచించిన వారికి తాము మద్దతుగా నిలబడతామన్నారు. సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీని నడపడం నిజమైన నాయకత్వం అని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ బూర్జ మండల అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, పొందూరు మండల అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ముఖ్య నాయకులు లోలుగు శ్రీరాముల నాయుడు, జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, బెవర మల్లేశ్వరరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు దుంపల శ్యామలరావు, బొడ్డేపల్లి అజంతాకుమారి, చింతాడ వెంకటరమణ, దుంపల చింజీవిరావుతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment