‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు’
మెళియాపుట్టి: ప్రేమ పేరుతో విశాఖలో ‘లా’ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లాకార్యవర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ శుక్రవారం చాపర గ్రామంలో పలు సంఘాల మహిళలతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఇటీవల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మరువకముందే మళ్లీ విశాఖలో న్యాయ విద్యార్థినిని ప్రేమపేరుతో దారుణంగా అత్యాచారం చేసిన ఘట న జరగడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదని తెలుస్తోందని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చే యాలని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై సామాజిక స్పృహను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కార్మిక సంఘం నేత కె.సూరయ్య, పోలాకి ప్రసాదరావు కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి పలు సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment