శబరిమలకు ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: శబరిమలకు వెళ్లేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్‌లు హనుమంతు అమరసింహుడు, కెఆర్‌ఎస్ శర్మలు తెలిపారు. శబరిమలకు వెళ్లే ఆర్టీసీ ప్రత్యేక బస్సును శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ శ్రీకాకుళం 1, 2 డిపోల మేనేజర్లు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ శబరిమలకు వెళ్లేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చిందన్నారు. భక్తులు బస్సు మొ త్తం లేదా విడివిడిగా టికెట్‌లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బస్సు మొత్తం బుక్ చేసుకుంటే ఏడుగురు స్వాములకు ఉచిత ప్రయా ణం కల్పిస్తామన్నారు. అలాగే 5రోజుల టూర్, 6రోజుల టూర్, 7రోజుల టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. శబరి మలకు వెళ్లే భక్తులు ఈ కింది నంబర్లను సంప్రదిస్తే ‘ఒక్క ఫోన్ కాల్ తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు’ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9959225608, 9959225609, 9959225610, 9959225611 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్ మేనేజర్లు వి.రమేష్, ఎ.గంగరాజు, ప్రసాద్, ఎం.పీ.రావు, రాజు, సెక్యూరిటీ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసులకు
ఉచిత ఆరోగ్య కార్డులు
శ్రీకాకుళం రూరల్: జిల్లాలో ప్రతి హోంగార్డు నుంచి పోలీసు అధికారి వరకూ అందరికీ ఉచి త ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. రాగోలు జెమ్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఉచిత వై ద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. కార్య క్రమానికి కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినే త బొల్లినేని భాస్కరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు ఉద్యోగులు వంద రూపాయలు కడితే కార్డు తీసుకోవచ్చునని, అదనంగా ఏ వ్యాధికు గురైనా ఎలాంటి నగదు చెల్లించకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు కూ డా కుటుంబ సభ్యులు సైతం ఉచితంగా చేయించుకోవచ్చునని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు సుగర్, బీపీ, ఈసీజీ, టూడీ ఎకో, గుండెకు సంబంధించిన పరీక్షలను జెమ్స్ వైద్యులు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గల రెండువేల మంది పోలీసులకు ఒకే దశలో వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పోలీసుకు వెల్ఫేర్ ఫండ్ ద్వారా రూ.100 చెల్లించి ఆరోగ్య కార్డులను తీసుకుంటామన్నారు. కిమ్స్ అధినేత బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది భవిష్యత్‌లో ఎలాంటి రుసుం చెల్లించకుండా జెమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, రాజశేఖర్, శేషాద్రి, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
మూడు నెలల వరకు
పింఛన్ తీసుకోవచ్చు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సామాజిక భద్రతా పింఛన్లులో భాగంగా ఎవరైనా పింఛన్ తీసుకోకపోతే మూడు నెలల్లోగా అలాంటి వారు పింఛన్ తీసుకోవచ్చని డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతి నెల సకాలంలో వివిధ కారణాల వల్ల పింఛన్ తీసుకోలేని వారికి ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. గత నెలలో జిల్లాలో పింఛన్ తీసుకోని వారు 2782 మంది ఉన్నారని, వీరిలో 1054 మంది మరణించారని, మిగిలినవారు వారి పింఛన్ మూడు నెలల్లోగా పొందవచ్చని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment