లూటీ
దళితుల ఇంటి
నిర్మాణ సామగ్రి
ఐదు లోడుల ఇసుక తీసుకెళ్లిపోయారు
ఇంటి నిర్మాణానికి వేసిన ఐదు లోడ్ల ఇసుకను టీడీపీ నేతలు ట్రాక్టర్ ద్వారా తరలించుకు పోయారు. ఇదేమిటని అడిగితే పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరించారు. దీంతో భయాందోళనతో వెనుతిరిగాము. – బస్వల తులసి,
జగనన్నకాలనీ లబ్ధిదారు, దండుగోపాలపురం
చంపుతామంటున్నారు..
ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని నిర్మాణం చేయడానికి తెచ్చిన మెటీరియల్స్‌ను తరలించుకుపోయారు. ఇదేమిటని అడిగితే చంపుతామంటున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా అధికారులు స్పందించటం లేదు.
– గుజ్జు ఆరుధ్ర, జగనన్న కాలనీ లబ్ధిదారు,
దండుగోపాలపురం
● అందరి ముందే దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలు
● వీడియోలు తీసినా వెరవని వైనం
● దండుగోపాలపురంలో టీడీపీ అరాచకం
సంతబొమ్మాళి:
దళితులపై టీడీపీ నేతల అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయి. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి తెచ్చుకున్న మెటీరియల్స్‌ను లూటీ చేసిన సంఘటన దండుగోపాలపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని దండుగోపాలపురం గ్రామంలో వైఎస్ జగన్ హయాంలో సర్వే నంబర్ 214–3సిలో 23 సెంట్లు ప్రభుత్వ భూమిని పేదల ఇళ్ల నిర్మాణాలకు కేటాయించారు. వీరిలో కొందరు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయగా, మరికొందరు నిర్మాణాలను కొంతమేరకు చేపట్టారు. మిగతా నిర్మాణాలు పూర్తి చేయడానికి లబ్ధిదారులు బస్వల తులసి, బస్వల మహాలక్ష్మి, గుజ్జు ఆరుద్ర, నౌపడ తవిటమ్మలు జగనన్న కాలనీ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో 8 లోడుల ఇసుక, ఐదు లోడుల ఇటుక, నాలుగు లోడుల చిప్స్, రెండులోడుల బెందడి రాయి మెటీరియల్స్‌ను నిల్వ ఉంచారు. అయితే మెటీరియల్ వేసిన ప్రభుత్వ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. వెంటనే అధికారాన్ని ఉపయోగించి లబ్ధిదారులకు ఎలాంటి సమయం ఇవ్వకుండా తమ ప్రతా పం చూపారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు మెటీరియల్ లూటీ చేయడానికి ప్రయత్నించగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. రెవెన్యూ, పోలీసులు సమక్షంలో ఈ తతంగమంతా జరిగినా ఎవ రూ ఏమీ అనకపోవడంతో లబ్ధిదారులు భయాందోళన చెందారు. లబ్ధిదారులు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తే వీడియోలు తీసినా, ఎవరికి చెప్పినా ఏమీ చేయలేరని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఇక్కడే ఉంటే పెట్రోల్ పోసి తగలబెడతామని తమను బెదిరించారని బాధితులు తెలిపారు. అదే రోజు రాత్రి ఇసుక, ఇటుక, చిప్స్‌ను ట్రాక్టర్ ద్వారా స్థానిక టీడీపీ నేతలు పొందర సురేష్, సురేష్, విష్ణుమూర్తి, సూరి, బాలక నారాయణలు తరలించుకొని పోయారని తెలిపారు. మిగిలిన మెటీరియల్స్‌ను చదును చేశారు. సుమారు ఐదు లక్షల విలువ చేసే మెటీరియల్, లూటీ చేశారని అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు.
మెటీరియల్స్ తీయాలని చెప్పాం
ప్రభుత్వ భూమిలో వేసిన ఇంటి నిర్మాణ మెటీరియల్స్‌ను తీయాలని లబ్ధిదారులకు తెలియజేశాను. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నేతలకు చెప్పాను. అయితే వారు పది రోజులైనా తీయరని టీడీపీ నేతలు సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసుల సమక్షంలో మెటీరియల్స్‌ను తరలించారు. – సీరపు వైకుంఠరెడ్డి,
వీఆర్వో, దండుగోపాలపురం
Comments
Please login to add a commentAdd a comment