ఉద్యాన తోటల అభివృద్ధికి ప్రణాళికలు
బూర్జ: కొబ్బరి, జీడి, మామిడి వంటి ఉద్యాన తోటలు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పెద్దపేటలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త పి.అశోక్ అన్నారు. శుక్రవారం పరిశోధనా స్థానంలోని కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అఖిల భారత సమన్వయ పరిశోధన పథకం ద్వారా రెక్కచిక్కుడు సాగుపై పరిశోధనలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా గిరిజన గ్రామాల్లో జన్యు సంపదను గుర్తిస్తామని తెలిపారు. జిల్లాలో కొబ్బరి రైతులకు మొక్కలు అందుబాటులో ఉండేలా చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. చీడపీడలు లేని దాదాపు ఏడు వేలు కొబ్బరి మొక్కలను అమ్మకానికి సిద్ధంగా ఉంచామన్నారు. ఉద్యాన పంటలు యాజమాన్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పెద్దపేట ఉద్యాన వన కేంద్రంలో సంప్రదించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యానవన తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త టి.రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం రేపు
కాశీబుగ్గ : ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ (పలాస) సౌజన్యంతో ఈ నెల 24న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్ వేదికగా జరిగే ఈ శిబిరానికి డాక్టర్ హెచ్.రాజ్‌కుమార్, డాక్టర్ అనూష హాజరై వైద్యసేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment