ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
జి.సిగడాం: జిల్లాలో 7లక్షల 24వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా వ్యవసాయాధికారి (జేడీ) త్రినాథస్వామి తెలిపారు. శుక్రవారం జి.సిగడాం మండలం మర్రివలసలో రైతులు పండించిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 3 లక్షల 60 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు నమోదైందన్నారు. వీటిలో 3లక్షల 45 వేల మంది రైతుల ఈకేవైసీ చేసుకున్నట్లు చెప్పారు. ఈకేవైసీ చేయిస్తేనే ధాన్యం కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు. 620 రైతు సేవా కేంద్రాలను ఎ, బి, సి కేటగిరీలుగా విభజించి 402 ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ధాన్యం సాధారణ రకం మద్దతు ధర రూ.2300, గ్రేడ్ ‘ఎ’ రకం మద్దతు ధర రూ.2320గా నిర్ణయించినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఏఓ యర్రా శారద, సర్పంచ్‌లు విక్రం కోటిబాబు, మాజీ సర్పంచ్ మానం సత్యారావు, విక్రం సత్యారావు, విక్రం సందీప్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు సింహాద్రి హరికృష్ణ, అలుగోలు లక్ష్మినారాయణ, పొగిరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment