లక్ష ఎకరాల్లో ప్రకృతి సేద్యం
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా వ్యవసాయాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలోని సాంకేతిక శిక్షణ కేంద్రంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యకర్తల రెండో విడత శిక్షణను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 42వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం విధానంలో పంటలు సాగవుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో లక్ష ఎకరాల్లో సాగు చేయాలన్నారు. మూడేళ్లలో 80 శాతం రసాయిన ఎరువులు, పురుగుల మందులు వినియోగం తగ్గాలని చెప్పారు. 70 వేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానంపై శిక్షణ లక్ష్యంగా కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు. వ్యవసాయ యాజమాన్య ఖర్చులు తగ్గించి.. కషాయాలు, ఘన, ద్రవ జీవామృతం, బీజామృతం వంటి వినియోగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు జిల్లా మేనేజర్ పి.రేవతి, అసిస్టెంట్ మేనేజర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment