రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పొందూరు: మండల కేంద్రంలోని నాయుడువీధికి చెందిన నల్లి వెంకటరమణ(49) అల్లూరి జిల్లా పాడేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు విజయనగరంలో స్ధిర నివాసం ఏర్పాటు చేసుకున్న నల్లి వెంకటరమణ పాడేరులో ఏపీఎస్‌బీ హెచ్‌సీగా పనిచేస్తున్నారు. బుధవారం విధులు ముగించుకుని బైక్‌పై విజయనగరం వచ్చేందుకు సిద్ధపడిన వెంకటరమణ పాడేరు రోడ్డుపై కూరగాయలు కొనుగోలు చేశారు. అయితే ఆ సమయంలో వెనుకనుంచి ఎవరో పిలిచినట్లు అనిపించడంతో బండిపై వెనుకకు తిరిగారు. అప్పుడే అతివేగంగా వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొనడంతో బైక్‌తో పాటు కొద్దిదూరం ఎగిరి రోడ్డుపై పడ్డాడు. రోడ్డుకు తల బలంగా ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి ఉద్యోగులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అందరితో మంచిగా ఉండే వెంకటరమణ మృతి చెందడంతో పొందూరు పట్టణంలోని నాయుడువీధిలో విషాదచాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య పద్మ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న కుమార్తె, ఇంజినీరింగ్ చదివిన కుమారుడు ఉన్నాడు. అంత్యక్రియలు నిమిత్తం మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment