కొందరు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కుమ్మకై ్క..
‘ముసుగు జర్నలిస్టుల’ దందాలకు కొందరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా సహాయ పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడెక్కడ లోపాలతో నిర్మాణాలు జరుగుతున్నాయో ఈ సిబ్బందే ముసుగు జర్నలిస్టులకు సమాచారమిచ్చి అక్రమ దందా సాగిస్తున్నారు. ముందు ముసుగు జర్నలిస్టులు అక్కడికెళ్లి ప్రశ్నించడం, ఫొటోలు తీయడం.. అక్కడి నుంచే సిబ్బందికి ఫోన్ చేయడం.. ఈలోగా వారొచ్చి మీడియాతో గొడవ పడితే ఇబ్బంది అని, ఎంతో కొంతకు సెటిల్ చేసుకోవాలని సలహా ఇవ్వడం, డబ్బు చేతికందిన తర్వాత వాటాలు వేసుకుని అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు.
ట్రూకాలర్‌లో టౌన్‌ప్లానింగ్ అని..
విచిత్రమేమిటంటే ఈ దందాలకు ప్రత్యేక ఫోన్ వాడుతున్నారు. ఆ ఫోన్ నెంబర్లను శ్రీకాకుళం టౌన్ ప్లానింగ్ పేరుతో ఫీడ్ చేసుకుంటున్నారు. ఎవరైనా ట్రూకాలర్‌లో చూస్తే టౌన్ ప్లానింగ్ అని వస్తుంది. దీంతో బాధితులు కూడా టౌన్ ప్లానింగ్ వాళ్లేమో అనుకుని ముసుగు జర్నలిస్టులను నమ్మి మోసపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment