● వైరస్ సోకితే..
అది టెక్కలి జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు. ఆస్పత్రి సిబ్బంది మాస్కులు, పీపీఈ కిట్లు ధరించి చికిత్సకు సిద్ధమయ్యారు. హెచ్‌ఎంపీ వైరస్ సోకిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారంటూ అటువైపుగా ఎవరినీ రానీయకుండా సిబ్బంది హడావుడిగా కనిపించారు. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే కాసేపటికే అదంతా మాక్‌డ్రిల్ అని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన ఈ మాక్‌డ్రిల్‌లో ఆస్పత్రి సూపరింటెండెంట్ బొడ్డేపల్లి సూర్యారావు, డాక్టర్ లక్ష్మణరావు, మహారాజ్, సిబ్బంది పాల్గొన్నారు. –టెక్కలి రూరల్
Comments
Please login to add a commentAdd a comment