ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల మధ్య ఆధిపత్య పోరు ఏకంగా వైవా వాయిస్ వాయిదా పడటానికి కారణమైంది. ఇక్కడ ఏడు రెగ్యులర్ బోధకులు పనిచేస్తున్నారు. బయోటెక్నాలజీలో నలుగురు, సోషల్ వర్కులో ఇద్దరు, ఎకనామిక్స్‌లో ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. ఈ విభాగాల్లో మాత్రమే పీహెచ్‌డీ కోర్సులు నిర్వహిస్తున్నారు. సోషల్ వర్కు పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్ వైవా వాయిస్ విషయంలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మధ్య విభేదాలు పొడచూపాయి. ప్రస్తుతం ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సోషల్ వర్కులో ఉన్నారు. ఒకరు ప్రిన్సిపాల్, ఒకరు హెచ్‌ఓడీగా పనిచేస్తున్నారు. రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులకు శుక్రవారం ఇద్దరికి ప్రీటాక్ నిర్వహించారు. ఇతర విశ్వవిద్యాలయం నుంచి ఎక్సటర్నల్ వచ్చారు. దీంతో అర్హత ఉన్న ఒక విద్యార్థికి గైడుగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్(ప్రిన్సిపాల్) వైవా వాయిస్‌కు అనుమతి కోరారు. అయితే హెచ్‌ఓడీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వైవా వాయిస్‌కు అనుమతి ఇవ్వలేదు. ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టి ప్రిన్సిపాల్ తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అధికారులు జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించకపోవటం సైతం చర్చనీయాంశంగా మారింది.
పరిశోధన విద్యార్థులకు తప్పని పాట్లు
వైవా వాయిస్ వాయిదా
Comments
Please login to add a commentAdd a comment