భద్రత డొల్ల.. రక్షణ కల్ల
మహిళా కళాశాల, హాస్టల్స్ ప్రాంగణం వెనక భాగంలో ప్రహారీ లేకపోవడంతో అవతల ఉన్న ఇళ్లల్లో నుంచి నేరుగా లోపలికి వచ్చే అవకాశం ఉన్న దృశ్యం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల, వసతి గృహాల ప్రాంగణంలో విద్యార్థినులకు రక్షణ కరువైంది. ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్లిపోతున్నారో.. తెలియని పరిస్థితులు అక్కడున్నాయి. గురువారం రాత్రి విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యంతో అక్కడి డొల్లతనం మరోసారి బయటపడింది. ఒక కళాశాల, నాలుగు బాలికల వసతి గృహాలు ఉన్న చోట తీసుకోవాల్సిన జాగ్రత్తలేవీ అక్కడ కనిపించడం లేదు. అంతంతమాత్రంగా భద్రత ఉన్న చోట ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వడంతో రాకపోకలు మరింత పెరిగాయి.
రక్షణేదీ..?
శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో కళాశాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల వసతి గృహాలు ఉన్నాయి. ఒక్క హాస్టల్ విద్యార్థులే వెయ్యి మందికి వరకు ఉంటారు. ఇక్కడే వసతి, భోజన వసతులు పొందుతున్నారు. డే స్కాలర్స్ అదనం. దాదాపు 2వేల మంది వరకు విద్యార్థులుండే ఈ ప్రాంగణానికి చుట్టు రక్షణ గోడల్లేవు. మహలక్ష్మీ నగర్ కాలనీ, కుమ్మరి వీధుల్లోని ఇళ్లల నుంచి నేరుగా హాస్టల్స్‌లోకి, కళాశాల ఆవరణలోకి సులువుగా బయట వ్యక్తులు రాకపోకలు సాగించొచ్చు. విద్యుత్ లైట్లు లేక, పెద్ద పెద్ద మొక్కలతో కళాశాల, హాస్టల్స్ వెనక పేరుకుపోయి అడవిని తలపించేలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం కళాశాల ప్రిన్సిపాల్ బ్లాక్ పక్కనున్న వాటర్ ట్యాంక్ దగ్గర దృశ్యాలు చూస్తే ఎవరికై నా అర్థమవుతుంది. అక్కడే వైన్ బాటిల్స్ కూడా కనిపించాయి. ఆకతా యిలు పట్ట పగలే ఇక్కడకు బైక్‌లపై వచ్చి ప్ర మాదకర విన్యాసాలు చేస్తుంటారు. పోలీసుల నిఘా ఉన్నప్పుడు కాస్త తగ్గుతారు. లేదంటే ఆ రోడ్డులో రేసింగ్ చేస్తుంటారు.
● మహిళా కళాశాలలో విద్యార్థినిపై
పాశవిక దాడి
● అపస్మారక స్థితిలోకి విద్యార్థిని
● ‘అకృత్యం’ వెనుక అనుమానాలెన్నో..
● పొంతన లేకుండా అధికారుల ప్రకటనలు
● హత్యాయత్నంగా కేసు నమోదు
● వార్డెన్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైమ్:
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో ఓ విద్యార్థినిపై పాశవిక దాడి జరిగింది. ఆమైపె లైంగికదాడి జరిగిందనే వార్తలు స్థానికంగా సంచనలం రేపాయి. తీవ్రంగా గాయపడడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనపై పోలీసులు, హాస్టల్ అధికారులు, తోటి విద్యార్థినులు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఒక్కో రకంగా వాదనలు వినిపించడం గమనార్హం. స్థానికులు, తోటి విద్యార్థినులు, విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పోలీసులు చెప్పిన వివరాల మేరకు..
జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాల ప్రాంగణంలో హాస్టళ్లు కూడా ఉన్నాయి. గురువారం రాత్రి ఆ ప్రాంగణంలో అమ్మాయి ఏడుపు శబ్దం వినిపించడంతో అటుగా వస్తున్న ఓ మహిళ లోపలకు వెళ్లి చూశారు. అక్కడ ఓ విద్యార్థి ఏడుస్తూ కనిపించడంతో ఆమెను బయటకు తీసుకువచ్చారు. ఏదో చెప్పబోతుండగానే ఆ విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెతో పాటు విద్యార్థినులు కూడా అక్కడకు చేరారు.
విద్యార్థినికి ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్పి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రిమ్స్‌కు తరలించారు. అయితే రాత్రి 9.30 గంటలకు విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పానని హాస్టల్ వార్డెన్ చెబుతున్నారు. కానీ ఆ టైమ్‌కు తమకు ఎవరూ ఫోన్ చేయలేదని తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం. రాత్రి 11 గంటలకు విద్యార్థిని కుటుంబ సభ్యులు రిమ్స్‌కు చేరుకున్నారు. పాప ఎడమ కంటి మీద, తలకు, మెడ కింద గాయాలు కనిపించాయని తండ్రి తెలిపారు. పాపకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ సమస్య లేదని, మన్యం జిల్లా సీఐ ప్రసాద్ వచ్చి ఎవరు అడిగినా ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్పాలని కోరారని పేర్కొన్నారు. ఆ సీఐ వార్డెన్ భర్తేనని చెప్పారు. తాము పాప పడిపోయిన స్థలా న్ని కూడా రెండు సార్లు చూశామని, రెండోసారి వెళ్లేటప్పుడు ఆ స్థలమంతా శుభ్రం చేసి ఉందని విద్యార్థిని మేనమామ, చిన్నాన్నలు చెప్పారు. పోలీసులు గురువారం రాత్రి మీడియాకు విద్యా ర్థినికి ఫిట్స్ వచ్చి పడిపోయిందనే సమాచారం అందజేశారు.
రంగంలోకి కలెక్టర్..
విద్యార్థినిపై అఘాయిత్యం జరిగిందని మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు రావడంతో సీఎంఓ నుంచి, హోంమంత్రి నుంచి, జిల్లా మంత్రి.. ఆరా తీస్తుండటంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రంగంలోకి దిగారు. తొలుత ఘటన జరిగిన మహిళా కళాశాల ప్రాంగణంలోని ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న చెత్త చెదారం పరిస్థితులను గురించి గట్టిగా నిలదీశారు.
‘రాత్రి 7.20 ప్రాంతంలో కళాశాల ప్రాంగణంలోకి ఇద్దరు ఎంటర్ అయినట్లు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. తర్వాత 7.30 ప్రాంతంలో అమ్మాయి అరుపులు వినడం 7:50 గంటలకు అంతా అక్కడికి చేరారు. అయితే అదే సమయంలో విజుబుల్ పోలీ సింగ్‌కని ఇద్దరు కానిస్టేబుళ్లు బయట గేటు వద్ద ఉండగా లోపల అవేర్‌నెస్ కార్యక్రమం జరుగుతోందంటూ’.. స్వయంగా పోలీసులు ఘటనాస్థలి సందర్శనకు వచ్చిన కలెక్టర్ వద్ద ధ్రువీకరించడం విశేషం. ఆ తర్వాత విద్యార్థిని చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడారు. బాధితురాలి ఒంటిపై ఉన్న గాయాలను పరిశీలించారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కాసేపు కౌన్సెలింగ్ చేశారు. విద్యార్థికి శరీరంపై గాయాలు ఉన్నట్లు వైద్యులు కూడా స్పష్టం చేశారు. కానీ రిపోర్టులేవీ చూపించ లేదు. ప రిస్థితి క్రిటికల్‌గా ఉందని వేరే ఆస్పత్రికి తీసుకెళ్దా మని చెప్పగా, విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత తరలించారు.
హత్యాయత్నమే అంటూ..
అడిషనల్ ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసుగా నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను నియమించినట్టు వెల్లడించారు.
ఘటన జరిగిన ప్రాంతం వద్ద కలెక్టర్ పరిశీలన
దర్శనాల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ రద్దు!
రథసప్తమికి వీఐపీ ట్రీట్‌మెంట్లు రద్దు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. –8లో
శరీరం నిండా గాయాలు.. మనసు నిండా బాధ.. ఏడిచేందుకు కూడా వీల్లేని స్థితి. అపస్మారక స్థితిలో నిండా ఇరవై ఏళ్లు లేని అమ్మాయి పడుతున్న నరక యాతన ఇది. ఓ వైపు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలీని దుస్థితిలో అమ్మాయి ఉంటే.. ఆమె చుట్టూ గురువారం మొదలుకుని శుక్రవారం వరకు హైడ్రామా నడిచింది. ఫిట్స్ వచ్చిందని కాసేపు, లైంగిక దాడి జరిగిందని మరికాసేపు, హత్యాయత్నం జరిగిందని ఇంకాసేపు ప్రకటనలు రావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు తోటి విద్యార్థినులు కూడా అయోమయానికి గురయ్యారు. అనేక దర్యాప్తుల తర్వాత అమ్మాయిపై హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనలో సమాధానంలేని ప్రశ్నలెన్నో..
శ్రీకాకుళం మహిళా కళాశాల, హాస్టల్స్ ప్రాంగణంలో తేటతెల్లమైన డొల్లతనం
పూర్తిగా ప్రహరీ లేని వైనం
గంజాయి బ్యాచ్, మందుబాబులు లోపలకు వెళ్తున్న దాఖలాలు
పర్యవేక్షణ అంతంతమాత్రమే
ఎగ్జిబిషన్‌తో తంటాలు..
ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న ప్రాంగణంలోనే ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో విచ్చలవిడితనం పెరిగిపోయింది. బయట వ్యక్తుల రాకపోకలకు అడ్డు లేకుండా పోయింది. గంజాయి, మద్యం సేవించే వ్యక్తులకు ఇదే అదనుగా మారింది. ఇప్పటికై నా అలాంటి అవకాశం ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది.
దర్యాప్తు ముమ్మరం..
శుక్రవారం ఉదయానికి ఈ వార్త పలు రకాలుగా వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డీజీపీ రిటైర్‌మెంట్ కార్యక్రమం కోసం ఎస్పీ మహేశ్వరరెడ్డి విజయవాడ వెళ్లడంతో డీఎస్పీ వివేకానంద ఆస్పత్రికి వెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితురాలిని తట్టి మాట్లాడేందుకు ప్రయత్నించగా అచేతనంగా ఉండిపోవడంతో బయటకు వచ్చేశారు. ఆయనతో పాటు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు, ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, సిబ్బందే కాక రూరల్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు రిమ్స్‌కు వెళ్లారు. వీరిని చూసి మన్యం జిల్లా సీఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అలా ఎందుకు చెప్పమన్నారు..?
ఘటన జరిగిన తర్వాత వార్డెన్ భర్త మన్యం జిల్లా సీఐ ప్రసాద్ శ్రీకాకుళం వచ్చి బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎవరు వచ్చి అడిగినా ఫిట్స్ వచ్చిందని చెప్పాలని కోరినట్లు తల్లిదండ్రులు చెప్పారు.
ఫిట్స్ వచ్చిందని ఎందుకు చెప్పారు..?
మహిళా కళాశాల విద్యార్థినిపై అఘాయిత్యం జరిగినట్టుగా ఫోన్ వచ్చింది. ఏంటీ సర్ విషయం.. ఎంత వరకు వాస్తవమని వన్‌టౌన్ సీఐ పైడపునాయుడ్ని ‘సాక్షి’ అడిగింది. అదేమి లేదు. ఫిట్స్ వచ్చి అమ్మాయి పడిపోయింది. మళ్లీ నార్మల్ అయింది. వెళ్లిపోయారని’ సీఐ సమాధానమిచ్చారు. ఒక్క సాక్షికే కాదు ఇతర మీడియా వాళ్లు అడిగినా సీఐ అదే సమాధానమిచ్చారు.
ఓ వైపు కలెక్టర్‌కు ఫోన్‌లు.. మరో వైపు నో సిగ్నల్..
ఆసుపత్రిలో కలెక్టర్ ఉండగానే సీఎంఓ నుంచో.. హోంమంత్రి నుంచో.. జిల్లా మంత్రుల నుంచో తెలియదు గాని వరుస ఫోన్‌లు వచ్చాయి. అయితే, ఆసుపత్రిలో సిగ్నల్ సరిగా లేకపోవడంతో ఆ ఫోన్‌లకు స్పందించేందుకు ఆయన నానా హైరానా పడ్డారు. వివరణ ఇద్దామని సెల్‌ఫోన్ సిగ్నల్ కోసం ఆసుపత్రి ప్రాంగణంలో చాలా వరకు తిరిగారు. అది చూసి ఏదో జరిగిందన్న అనుమానం అక్కడి ఉన్న వారందరికీ కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment