ఆధారాలు ఎందుకు చెరిపారు..?
ఉదయం 10 గంటల సమయమయ్యేసరికి మద్యం సీసాలు ఇతరత్రా వాటిని తొలగించి మొదటిదానికన్న కాస్త క్లీన్‌గా కనిపించేలా చేశారు. ఇంత తొందరగా ఆ ప్రాంతం క్లీన్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎందుకిలా చేశారు..?
విద్యార్థినికి ఫిట్స్ వచ్చిందని 9.30గంటలకు బాధితురాలి తల్లి దండ్రులకు సమాచారం అందజేసి నట్లు హాస్టల్ వార్డెన్ తెలిపారు. కానీ విద్యార్థిని తల్లిదండ్రులు మా త్రం తమకు ఎవరూ ఫోన్ చేసి చెప్పలేదని, తాము ఫోన్ చేసినప్పుడు తోటి విద్యార్థులు సమా చారం ఇచ్చారని చెబుతున్నారు.
క్లూస్ టీమ్ ఆలస్యం వెనుక.. ?
గురువారం రాత్రి నుంచి ఘటన వార్త దావానలంలా వ్యాపిస్తున్నా.. ఆధారాలు సేకరించాల్సిన క్లూస్ టీమ్ మాత్రం శుక్రవారం ఉదయం 11.15 గంటలకు సంఘటనాస్థలానికి చేరుకుంది. అప్పటికే కలెక్టర్ కూడా సీన్ విజిట్ చేసి వెళ్లిపోయారు. పరిసరాలను శుభ్రం చేశారు కూడా..! అంత ఆలస్యంగా రావడం వెనుక ఆంతర్యమేమిటోననే చర్చ కూడా నగరంలో జరుగుతోంది.
విద్యార్థినిపై దాడి జరిగిన ప్రాంతం ఇది. శుక్రవారం ఉదయం 6.30
గంటల వరకు ఇలాగే ఉంది.
జిల్లాలో వరుస ఘటనలు వణుకు పుట్టిస్తున్నాయి. గొలుసు దొంగతనాలకే భయ పడిపోతుంటే.. ఇప్పుడు ఏకంగా హత్యలు, దాడులు కూడా వెలుగు చూస్తున్నాయి. వరుస పెట్టి జరుగుతున్న ఘటనలతో మహిళల రక్షణపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
● ఇటీవల నగరంలోని న్యూకాలనీలో పొందూరుకు చెందిన మహిళ హత్యకు గురైంది.●
● గత ఏడాది అక్టోబరు 19 రాత్రి కాశీబుగ్గ కేంద్రంగా ఇద్దరు బాలికలను పుట్టిన రోజు వేడుకలకని పిలిచి ఇద్దరు యువకులు లైంగిక దాడి పాల్పడ్డాడు.
● గత అక్టోబరులో మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యా దు చేశారు.
● ఇటీవల జిల్లాకేంద్రంలోని ఆర్మీకాలింగ్ పేరిట మైనర్ బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు పెట్టడమే కాక వారిని హింసించినట్లు బీవీ రమణపై బాధిత బాలికలు ఎస్పీ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు.
● ఆమదాలవలస మండలంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి మత్తుమందు కలిపి లైంగిక దాడి.
● టెక్కలిలో ఓ టీచర్ పిల్లలకు అసభ్యకర సందేశాలు పంపిస్తూ దొరికిపోయారు.
ఇలా రాస్తూపోతే అకృత్యాలకు కొదవేలేదు.
Comments
Please login to add a commentAdd a comment