రూట్‌మ్యాప్ సిద్ధం
● రథసప్తమి వేడుకకు
శ్రీకాకుళం క్రైమ్ : రథ సప్తమి వేడుకల నిర్వహణ కో సం జిల్లా యంత్రాంగం సన్నద్ధమైందని జిల్లా అదనపు ఎస్పీ కేవీ రమణ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం డీఎస్పీ సీహెచ్ వివేకానందతో కలసి విలేకరులతో మాట్లాడారు. 2300 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. రూట్‌మ్యాప్‌ను వెల్లడించారు.
రూట్ నంబర్ 1 : ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం సింహద్వారం జంక్షన్ మీదుగా వచ్చే భక్తులు కిమ్స్ ఆస్పత్రి–డే అండ్ నైట్ కూడలి–ఏడురోడ్ల కూడలి–ఓబీఎస్ కూడలి–అరసవల్లి మిల్లు కూడలి మీదుగా 80 ఫీట్ రోడ్డు పార్కింగ్, ఎల్.ఎన్.ఫంక్షన్ హాల్ అపోజిట్ లేఅవుట్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోవాలి. అక్కడ నిర్దేశించిన ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకుని దర్శనానికి వెళ్లాలి.
రూట్ నంబర్ 2 : కొత్త రోడ్డు నుంచి బలగ కూడలి మీదుగా విచ్చేసే భక్తులు ఆర్టీసీ కాంప్లెక్స్–అంబేడ్కర్ కూడలి–డేఅండ్‌నైట్ కూడలి–7 రోడ్ల కూడలి–పందుంపుల్ల కూడలి–ఓబీఎస్ కూడలి–అరసవల్లి మిల్లు కూడలి మీదుగా 80 ఫీట్ రోడ్డు పార్కింగ్, ఎల్.ఎన్.ఫంక్షన్ హాల్ ఆపోజిట్ లేఅవుట్ ఫంక్షన్ హాలుకు చేరి పార్కింగ్ చేసుకోవాలి.
రూట్ నంబర్ 3 : పెద్దపాడు నుంచి రామలక్ష్మణ మీదుగా వచ్చే భక్తులు సూర్యమహల్–చిన్నబరాటం–ఓబీఎస్ కూడలి–అరసవల్లి మిల్లు కూడలి మీదుగా 80 ఫీట్‌కు చేరి పైన పేర్కొన్న చోటనే పార్కింగ్ చేసుకోవాలి.
రూట్ నంబర్ 4 : నవభారత్, బాలభారత్ మీదుగా వచ్చే భక్తులు గుజరాతీపేట కూడలి–ఏడు రోడ్ల కూడలి–పందుంపుల్ల కూడలి–ఓబీఎస్ కూడలి–అరసవల్లి మిల్లు కూడలి మీదుగా 80 ఫీట్ రోడ్డుకు చేరి పైన పేర్కొన్న చోటనే పార్కింగ్‌కు చేరుకోవాలి.
రూట్ నంబర్ 5 : గార, శ్రీకూర్మం మీదుగా వచ్చే భక్తులు వాడాడ జంక్షన్ వద్ద వాహనాలను నిర్దేశించిన పార్కింగ్‌లో పెట్టి దర్శనానికి వెళ్లాలి. అరసవల్లి గ్రామం వైపు ఎట్టి వాహనాలు అనుమతించరు.
టెక్కలి, నరసన్నపేట నుంచి వచ్చేవారు..
ఎన్‌హెచ్–16 మీదుగా వచ్చే భక్తులు టెక్కలి–నరనన్నపేట ఎన్‌హెచ్–16–అంపోలు అండర్ బ్రిడ్జి వద్ద సర్వీస్ రోడ్డులోకి ప్రవేశించి అంపోలు జైలు రోడ్డు మీదుగా ఆడవరం గ్రామం–అంపోలు గ్రామం–అంపోలు కూడలి (గార రోడ్డు)–వాడాడ జంక్షన్ వద్దకు చేరుకోవాలి. నిర్దేశించిన పార్కింగ్‌లో వాహనాలను పెట్టుకోవాలి. దర్శనం అనంతరం పార్కింగ్ ప్రదేశం నుంచి ఎన్‌హెచ్–16 మీదుగా టెక్కలి–నరసన్నపేట వైపు తిరిగి వెళ్లేందుకు వాడాడ జంక్షన్–ఒప్పంగి గ్రామం–సానివాడ జంక్షన్–శాస్త్రుల పేట గ్రామం–చెట్టువానిపేట జంక్షన్ నుంచి ఎన్‌హెచ్ –16 మీదుగా వెళ్లాలి.
పార్కింగ్ ప్లేసులివే..
● 80 ఫీట్ రోడ్డులో గల కేంద్రమంత్రి స్వగృహం పక్కన ఖాళీ స్థలంలో ఆటోలు, టాటా ఏస్ వాహనాలు నిలుపుకోవచ్చు.
● 80 ఫీట్ రోడ్డులో కేంద్రమంత్రి స్వగృహం ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేసుకోవాలి.
● 80 ఫీట్‌రోడ్డులో గల బీకేఎస్ కళాశాల పక్కనుంచి కొత్తగా ఏర్పాటుచేసిన రోడ్డు మార్గంలో వెళ్లి కొయ్యాన కనకయ్య కాలనీలో గల ఎల్.ఎన్.ఫంక్షన్ హాల్ ఎదురుగా ఖాళీ ప్రదేశంలో కార్ పార్కింగ్ చేసుకోవాలి.
● అరసవల్లి టెంపుల్ మెయిన్ ఆర్చి ఎదురుగా గల సూర్యతేజ ఫంక్షన్ హాల్‌కు చెందిన ఖాళీ ప్రదేశం వీవీఐపీ పార్కింగ్ ప్రదేశంగా నిర్దేశించారు.
● వాడాడ జంక్షన్ వద్ద అనగా గార రోడ్డులో అసిరితల్లి అమ్మవారి గుడి దగ్గరలో గల అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం ఖాళీ ప్రదేఽశం కార్, ద్విచక్రవాహనాల పార్కింగ్ ప్రదేశంగా గుర్తించారు.
● ఖాజీపేట నుంచి వచ్చే వాహనాలకు అరసవల్లి ఎంహెచ్ స్కూల్ పక్కన గల అరసవల్లి శ్రీకాకుళం మున్సిపల్ శాఖకు చెందిన ఖాళీ ప్రదేశంలో కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు పార్కింగ్ చేసుకోవాలి.
80 ఫీట్ రోడ్డు పార్కింగ్ నుంచి బయటకు వెళ్లే మార్గం..
80 ఫీట్ రోడ్డు–వాంబే కాలనీ–పొన్నాడ బ్రిడ్జి కూడలి–సంతోషిమాత టెంపుల్–జెడ్పీ కార్యాలయం–కిన్నెర థియేటర్–ఓబీఎస్ కూడలి–ఏడురోడ్ల కూడలి–నవభారత్ కూడలి–ఎన్‌హెచ్–16 గుండా వెళ్లాలి.
80 ఫీట్ రోడ్డు పార్కింగ్ స్థలం ( కేంద్రమంత్రి స్వగృహం వెనుక ) నిలుపు ఆటోలు ఏపీహెచ్‌బీ కాలనీ మీదుగా జడ్పీ కార్యాలయానికి చేరుకోవాలి.
పైన పేర్కొన్న ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 2 ఉద యం 7 గంటల నుంచి 4వ తేదీ రాత్రి రథసప్తమి వేడుకలు ముగిసినంతవరకు కొనసాగుతాయి.
2, 3 తేదీల్లో ప్రభుత్వం పలు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటుచేసింది. కార్యక్రమాలకు వచ్చేవారు వాహనాలను కేఆర్ స్టేడియంలో నిలుపుకోవాలి.
గార వైపునుంచి వచ్చే టికెట్టు కొన్న భక్తులు అరసవల్లి అసిరితల్లి అమ్మవారి గుడి నుంచి ఆ దిత్య నగర్ కాలనీ మీదుగా వెళ్లి ఉమెన్స్ కళాశా ల మీదుగా అరసవల్లి మిల్లు కూడలి మీదుగా ఎల్‌ఎన్ ఫంక్షన్‌హాల్ ఎదురుగా ఖాళీ ప్రదేశానికి చేరుకుని పార్కింగ్ చేసుకోవాలి.
అరసవల్లి గుడి పక్కన ఉండే నివాసగృహాల వారికి ఓ గంటపాటు అధికారులు నిర్దేశించిన సమయంలో ఉచిత దర్శనానికి అనుమతి.
Comments
Please login to add a commentAdd a comment