మహిళలకు రక్షణ కరువు
● విశాఖలో పరామర్శించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కూటమి ప్రభుత్వంలో మహిళలకు, విద్యార్థినులకు, చిన్నారులకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖ పట్నంలోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినిని శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థిని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళకు రక్షణ లేదని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోం మినిస్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ ఆరు నెలల్లో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయని అయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థినిని పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పేడాడ రమణకుమారి, బెందాళం సత్యవతి ఉన్నారు.
‘మహిళలకు రక్షణ కల్పించాలి’
ఇచ్ఛాపురం: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళాధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య అన్నారు. ఆమె శుక్రవారం విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. మూడునెలల కిందట శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు విద్యార్థినులపై జరిగిన సామూ హిక అత్యాచారం ఘటన మరువక ముందే మహిళా డిగ్రీకళాశాల విద్యార్థిని దాడికి గురి కావడం బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం నగరంలో గల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోగల హాస్టల్స్‌కు సరైన రక్షణ కల్పించాలని, విద్యార్థినుల రక్షణ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్‌ఎఫ్ ఐ నాయకులు అన్నారు. మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరచడం బాధాకరమన్నారు. మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయకుండా ఉండాలని, ప్రైవేటు వ్యక్తులు రాకుండా నిరోధించాలని కోరారు. బాధితురాలిని వారు పరామర్శించారు. పరామర్శించినవారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.పవిత్ర, డి.చందు, టౌన్ కమిటీ సభ్యులు రాహుల్, జగదీష్ ఉన్నారు.
బీసీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ బాలి కల కళాశాల వసతి గృహం–3 వార్డెన్ ఎం.పూర్ణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి హాస్టల్ విద్యార్థినిపై జరిగిన దాడి నేపథ్యంలో కలెక్టర్ నిర్ణ యం తీసుకున్నారు. హాస్టల్ విద్యార్థినిపై బయట వ్యక్తులు దాడి చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో కలెక్టర్ యు ద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment